LOADING...
Happy Birthday Rohit Sharma: రికార్డుల బాహుబలి.. రో'హిట్‌' శర్మకు బర్త్‌డే విషెస్..!
రికార్డుల బాహుబలి.. రో'హిట్‌' శర్మకు బర్త్‌డే విషెస్..!

Happy Birthday Rohit Sharma: రికార్డుల బాహుబలి.. రో'హిట్‌' శర్మకు బర్త్‌డే విషెస్..!

వ్రాసిన వారు Jayachandra Akuri
Apr 30, 2026
09:09 am

ఈ వార్తాకథనం ఏంటి

భారత క్రికెట్ చరిత్రలో అత్యంత ప్రతిష్ఠాత్మక బ్యాటర్లలో ఒకరిగా నిలిచిన రోహిత్ శర్మ ఈరోజు (ఏప్రిల్ 30) తన 39వ జన్మదినాన్ని జరుపుకుంటున్నారు. 'హిట్‌మ్యాన్'గా అభిమానుల ప్రేమను సంపాదించిన రోహిత్, 2007 జూన్ 23న ఐర్లాండ్‌లోని బెల్ఫాస్ట్ వేదికగా అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టారు. అప్పటి నుంచి అన్ని ఫార్మాట్లలో అద్భుత ప్రదర్శనలతో అనేక రికార్డులను నెలకొల్పుతూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించారు. ప్రస్తుతం టెస్ట్, టీ20 ఫార్మాట్లకు వీడ్కోలు పలికిన రోహిత్, కేవలం వన్డేల్లో మాత్రమే కొనసాగుతూ తన బ్యాటింగ్‌తో మెప్పిస్తున్నారు. 2013లో టెస్ట్ అరంగేట్రం చేసిన ఆయన, మొత్తం 67 మ్యాచ్‌లలో 4,301 పరుగులు సాధించారు. ఇందులో 12 శతకాలు, 18 అర్ధశతకాలు ఉన్నాయి.

వివరాలు

అత్యంత విజయవంతమైన ఓపెనర్లలో రోహిత్ శర్మ ఒకరు

2019లో దక్షిణాఫ్రికాపై సాధించిన 212 పరుగులు ఆయన టెస్ట్ కెరీర్‌లో అత్యధిక స్కోర్‌గా నిలిచింది. టీ20 అంతర్జాతీయాల్లో కూడా రోహిత్ శర్మ తన ప్రత్యేకతను చాటుకున్నారు. 2007లో ప్రారంభమైన టీ20 కెరీర్‌లో 159 మ్యాచ్‌లు ఆడి 4,231 పరుగులు చేశారు. ఈఫార్మాట్‌లో అత్యధికంగా 5 శతకాలు చేసిన ఆటగాడిగా అరుదైన రికార్డు సాధించారు. ఆటగాడిగా 2007లో, కెప్టెన్‌గా 2024లో రెండు సార్లు టీ20 ప్రపంచకప్ గెలుచుకోవడం ఆయన కెరీర్‌లో ప్రత్యేక ఘనత. 2024లో టీ20 ప్రపంచకప్ విజయం అనంతరం ఈ ఫార్మాట్‌కు వీడ్కోలు పలికారు. వన్డే ఫార్మాట్‌లో రోహిత్ శర్మ అత్యంత విజయవంతమైన ఓపెనర్లలో ఒకరిగా గుర్తింపు పొందారు. 282 మ్యాచ్‌లలో 11,577 పరుగులు చేసి, 49 సగటుతో స్థిరమైన ప్రదర్శన కనబరిచారు.

వివరాలు

వన్డేల్లో మూడు డబుల్ సెంచరీలు

ఇందులో 33 శతకాలు, 61 అర్ధశతకాలు ఉన్నాయి. 50 ఓవర్ల ఫార్మాట్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ అయిన 264 పరుగులు ఆయన పేరిటే ఉంది. అంతేకాదు, వన్డేల్లో మూడు డబుల్ సెంచరీలు చేసిన ఏకైక ఆటగాడిగా కూడా రికార్డు సృష్టించారు. ఐపీఎల్‌లోనూ రోహిత్ శర్మ తన ఆధిపత్యాన్ని చాటుకున్నారు. టోర్నీ ప్రారంభ 15 సీజన్లలో ఆరు టైటిల్స్ గెలుచుకుని అత్యంత విజయవంతమైన కెప్టెన్లలో ఒకరిగా నిలిచారు. 2019 వన్డే ప్రపంచకప్‌లో ఐదు శతకాలు నమోదు చేయడం, అదే ఏడాది టెస్ట్ ఓపెనర్‌గా మారిన తర్వాత తొలి సిరీస్‌లోనే మూడు శతకాలు చేయడం ఆయన స్థాయిని మరోసారి నిరూపించాయి.

Advertisement

వివరాలు

టీ20 ప్రపంచకప్ ను గెలిపించిన రోహిత్ శర్మ

కెప్టెన్‌గా కూడా రోహిత్ శర్మ భారత జట్టును సమర్థంగా నడిపించారు. 2023లో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్, వన్డే వరల్డ్ కప్ ఫైనల్‌కు భారత్‌ను తీసుకెళ్లారు. ఆ టైటిల్స్ చేజారినా, 2024లో టీ20 ప్రపంచకప్ గెలిపించి 13 ఏళ్ల ఐసీసీ ట్రోఫీ నిరీక్షణకు తెరదించారు. అనంతరం 2025లో ఛాంపియన్స్ ట్రోఫీ గెలిపించి తన నాయకత్వాన్ని మరొకసారి చాటుకున్నారు. కెరీర్ చివరి దశలో ఉన్నప్పటికీ, రోహిత్ శర్మ తన బ్యాటింగ్ ప్రతిభతో అభిమానులను అలరిస్తూనే ఉన్నారు.

Advertisement