LOADING...
Hardik Pandya: టీ20ల్లో హార్ధిక్ పాండ్యా అరుదైన మైలురాయి.. సిక్సర్ల సెంచరీతో టాప్-5లోకి! 
టీ20ల్లో హార్ధిక్ పాండ్యా అరుదైన మైలురాయి.. సిక్సర్ల సెంచరీతో టాప్-5లోకి!

Hardik Pandya: టీ20ల్లో హార్ధిక్ పాండ్యా అరుదైన మైలురాయి.. సిక్సర్ల సెంచరీతో టాప్-5లోకి! 

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 09, 2025
10:31 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారత క్రికెటర్ హార్దిక్ పాండ్యా (Hardik Pandya) మరో అరుదైన మైలురాయిని సాధించాడు. తనకు అత్యంత ఇష్టమైన టీ20 ఫార్మాట్‌లో ఆల్‌రౌండర్‌ సిక్సర్ల సెంచరీ పూర్తి చేశాడు. కటక్‌లోని బారబతి స్టేడియంలో దక్షిణాఫ్రికా బౌలర్లపై సాగించిన దాడిలో పాండ్యా నాలుగు భారీ సిక్సర్లు బాదాడు. దీంతో అంతర్జాతీయ టీ20ల్లో వంద సిక్సర్ల మార్క్‌ను దాటుతూ అసాధారణ క్లబ్‌లోకి ప్రవేశించాడు. ఈ ఫార్మాట్‌లో సిక్సర్ల సెంచరీ చేసిన నాలుగో భారత క్రికెటర్‌గా కూడా అగ్రస్థానాల్లో నిలిచాడు. మూడు నెలల విరామం తర్వాత పునరాగమనం చేసిన మ్యాచ్‌లోనే ఈ ఘనత నమోదు చేయడం విశేషం.

Details

అగ్రస్థానంలో రోహిత్ శర్మ

సఫారీలపై మంగళవారం జరిగిన మ్యాచ్‌లో 59 పరుగులతో అజేయంగా నిలిచి టీమిండియాకు మ్యాచ్ విన్నర్‌గా నిలిచిన పాండ్యా, టీ20ల్లో తన దూకుడు బ్యాటింగ్‌తో మరోసారి తన ప్రభావాన్ని చూపాడు. అయితే, అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక సిక్సర్ల రికార్డు మాత్రం హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ (Rohit Sharma) పేరిటే ఉంది. బంతిని సులభంగా స్టాండ్స్‌లోకి పంపడంలో ప్రసిద్ధుడైన రోహిత్.. ఇప్పటివరకు 205 సిక్సర్లు బాది అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ప్రస్తుతం టీమిండియా సారథి సూర్యకుమార్ యాదవ్ 155 సిక్సర్లతో రెండో స్థానంలో నిలిచాడు.

Details

మూడో స్థానంలో విరాట్ కోహ్లీ

సిక్సర్ల సెంచరీ జాబితాలో విరాట్ కోహ్లీ 124 సిక్సర్లతో మూడో స్థానంలో ఉన్నాడు. తాజా ఫీట్‌తో హార్దిక్ పాండ్యా నాలుగో స్థానాన్ని దక్కించుకున్నాడు. కాగా కేఎల్ రాహుల్ 99 సిక్సర్లతో అయిదో స్థానంలో ఉన్నాడు. గతేడాది టీ20 ప్రపంచకప్‌ తర్వాత రోహిత్, కోహ్లీ ఈ ఫార్మాట్‌కు విరామం ప్రకటించడంతో, పాండ్యా ఇంకా 25 సిక్సర్లు కొట్టగలిగితే కోహ్లీ రికార్డును కూడా అధిగమించే అవకాశం ఉన్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు.

Advertisement

ట్విట్టర్ పోస్ట్ చేయండి

టీ20ల్లో వంద సిక్సర్లు బాదిన ఆల్ రౌండర్

Advertisement