LOADING...
Hardik Pandya: రూ.10 కోట్లు విలువ చేసే లగ్జరీ కారులో హార్దిక్ పాండ్యా..ప్రియురాలితో చక్కర్లు
రూ.10 కోట్లు విలువ చేసే లగ్జరీ కారులో హార్దిక్ పాండ్యా..ప్రియురాలితో చక్కర్లు

Hardik Pandya: రూ.10 కోట్లు విలువ చేసే లగ్జరీ కారులో హార్దిక్ పాండ్యా..ప్రియురాలితో చక్కర్లు

వ్రాసిన వారు Moogati Shabari
Mar 19, 2026
02:04 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారత క్రికెటర్ హార్దిక్ పాండ్యా తాజాగా తన ప్రియురాలితో కలిసి విలాసవంతమైన కారులో విహరిస్తూ కనిపించారు. ఈ మధ్యనే ఆయన రూ.10 కోట్ల విలువైన ఫెరారీ 12 సిలిండర్ కారు కొనుగోలు చేశారు. ఈ కారు రెండు సీట్లతో రూపొందించబడింది. అందులో తన ప్రియురాలు మహీకాతో కలిసి ఆయన ప్రయాణిస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

వివరాలు

కారు ప్రత్యేకతలివే..

ఈ అత్యాధునిక 2 సీటర్ వాహనం కేవలం 2.9 సెకన్లలోనే గంటకు 100 కిలోమీటర్ల వేగాన్ని చేరుకోగలదు. అంతేకాకుండా ఇటీవల తన కుమారుడికి రూ.4 కోట్ల విలువైన కారును హార్దిక్ పాండ్యా బహుమతిగా అందించిన విషయం తెలిసిందే. ఇదే సమయంలో తాజా టీ20 ప్రపంచకప్ విజేతగా నిలిచిన భారత జట్టులో కూడా హార్దిక్ పాండ్యా సభ్యుడిగా ఉన్నారు. ఖరీదైన కారులో తన లవర్‌తో కలిసి విహరిస్తున్న వీడియో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

వైరల్ అవుతున్న వీడియో: 

Advertisement