Page Loader
మాంచెస్టర్ యునైటెడ్ కెప్టెన్సీ నుంచి తప్పుకున్న హ్యారీ మాగ్వైర్‌
మాంచెస్టర్ యునైటెడ్ కెప్టెన్సీ నుంచి తప్పుకున్న హ్యారీ మాగ్వైర్‌

మాంచెస్టర్ యునైటెడ్ కెప్టెన్సీ నుంచి తప్పుకున్న హ్యారీ మాగ్వైర్‌

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 17, 2023
10:32 am

ఈ వార్తాకథనం ఏంటి

మాంచెస్టర్ యునైటెడ్ కెప్టెన్సీ నుంచి హ్యారి మాగ్వైర్‌ తప్పుకున్నాడు. ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా అతను వెల్లడించారు. ఇక కెప్టెన్సీ రేసులో మాంచెస్టర్ యునైటెడ్ మిడ్ ఫీల్డర్ బ్రూనో ఫెర్నాండెజ్ ముందు వరుసలో ఉన్నాడు. బ్రూన్ ఫెర్నాండెజ్‌తో పాటు మరికొంతమంది పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. మాంచెస్టర్ యునైటెడ్ కెప్టెన్ గా ఇన్నాళ్లు కొనసాగడం చాలా గర్వంగా ఉందని హ్యారి మాగ్వైర్‌ తెలిపారు. దీనిపై స్పందించిన మాంచెస్టర్ యునైటెడ్ ఫ్రాంచైజీ గత మూడున్నర సంవత్సరాలుగా కెప్టెన్‌గా హ్యారీ మాగ్వైర్‌ అందించిన సేవలకు ధన్యవాదాలు అని, మాంచెస్టర్ యునైటెడ్ కు కొత్త కెప్టెన్ ను త్వరలోనే ప్రకటిస్తామని స్పష్టం చేసింది.

Details

హ్యారీ మాగ్వైర్‌ స్థానంలో  బ్రూన్ ఫెర్నాండెజ్?

హ్యారి మాగ్వైర్‌ కి స్థానంలో బ్రూన్ ఫెర్నాండెజ్ ఎంపికయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఫెర్నాండేజ్ జనవరి 2020లో యునైటెడ్ క్లబ్‌లో చేరాడు. అప్పటి నుంచి మెరుగైన ప్రదర్శన చేస్తూ జట్టులో కీలక సభ్యునిగా ఎదిగాడు. మాగ్వైర్ అందుబాటులో లేనప్పుడు జట్టుకు నాయకత్వం కూడా వహించాడు. ఫెర్నాండెజ్ ఇప్పటివరకూ 185 మ్యాచుల్లో 64 గోల్స్ చేశాడు. అదే విధంగా మంచెస్టర్ యునైటెడ్ కెప్టెన్సీ రేసులో ల్యూక్ షా, కాసేమిరో పేర్లు కూడా వినిపిస్తున్నాయి. లుక్ షా క్లబ్ లో ఎక్కువకాలం పనిచేసిన ఆటగాళ్లలో ఒకడు. అతను అనేకసార్లు గాయాల భారీన పడినా, జట్టులో నిలకడగా రాణిస్తున్నాడు. యునైటెడ్ తరపున అతను ఏకంగా 260 మ్యాచ్‌లు ఆడాడు