
IPL 2025: అతను చిచ్చర పిడుగులా రాణిస్తున్నాడు.. వైభవ్ సూర్యవంశీపై మోదీ ప్రశంసలు
ఈ వార్తాకథనం ఏంటి
ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడిన యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీపై దేశ ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసల జల్లు కురిపించారు.
తన చిన్న వయసులోనే అద్భుతమైన ప్రదర్శన చేస్తూ అందరి దృష్టిని ఆకర్షించిన ఈ యువ ఆటగాడిని ప్రధాని ప్రత్యేకంగా అభినందించారు.
బీహార్ వేదికగా మే 4 నుంచి 15 వరకు జరగనున్న ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌ను ప్రధాని మోదీ ఆదివారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా తన ప్రసంగంలో మోదీ ఐపీఎల్‌లో బీహార్‌కు చెందిన వైభవ్ సూర్యవంశీ 35 బంతుల్లో సెంచరీ చేశాడు.
చిన్న వయసులోనే ఇలా రాణించడం గొప్ప విషయం. అతని విజయాల వెనక ఉన్న కృషి అభినందనీయం.
Details
నూతన క్రీడలకు అవకాశం
వరుసగా మ్యాచ్‌లు ఆడి తన ఆటను మెరుగుపరచుకున్నాడు.
ఎక్కువగా ఆడే వారికి రాణించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయంటూ కొనియాడారు. క్రీడల రంగానికి ఎన్డీఏ ప్రభుత్వం ఎంత ప్రాధాన్యత ఇస్తోందనేదాన్ని ప్రధాని వివరించారు.
కొత్త క్రీడలకు అవకాశాలు కల్పించేందుకు ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌లో గట్కా, ఖోఖో, మల్కాంబ్, యోగాసన వంటి ఆటలను చేర్చినట్లు తెలిపారు.
ఇప్పుడు యువ అథ్లెట్లు వుషు, లాన్ బాల్స్, రోలర్ స్కేటింగ్ వంటి క్రీడల్లోనూ ప్రతిభ చూపుతున్నారని అన్నారు.
Details
ఢిల్లీ వేదికగా షూటింగ్, జిమ్నాస్టిక్స్, ట్రాక్ సైక్లింగ్ ఈవెంట్స్
మోదీ మాట్లాడుతూ, దేశానికి కొత్త విద్యా విధానం తీసుకొచ్చిన విషయాన్ని గుర్తుచేశారు. ఈ విధానం క్రీడలను విద్యలో భాగంగా చేస్తూ, విద్యార్థులలో ఆటతీరు పెంపొందించేలా రూపుదిద్దుకున్నదని చెప్పారు.
క్రీడల వల్ల టీమ్ వర్క్, కలసి ముందుకు సాగే తత్వం అలవడుతుందని, జీవితంలో ఇది కీలకమని వివరించారు.
ఈ ఏడాది ఖేలో ఇండియా యూత్ గేమ్స్ బీహార్‌లోని పాట్నా, రాజ్‌గిర్, గయా, భగల్‌పూర్, బెగుసరాయ్ నగరాల్లో జరుగనున్నాయి.
ఢిల్లీ వేదికగా షూటింగ్, జిమ్నాస్టిక్స్, ట్రాక్ సైక్లింగ్ ఈవెంట్స్ నిర్వహించనున్నారు.