ఆర్సీబీ ఫ్లే ఆఫ్స్ కి చేరుకోకపోవడానికి కారణం అతడే : డుప్లెసిస్
ఐపీఎల్ 2023 ఫ్లే ఆఫ్ రేసు నుంచి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ నిష్క్రమించింది. తప్పక గెలవాల్సిన మ్యాచులో గుజరాత్ టైటాన్స్ చేతిలో ఓడిపోయి ఇంటి దారి పట్టింది. పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో నిలిచిన ఈ జట్టు 14 మ్యాచుల్లో 14 పాయింట్లను మాత్రమే దక్కించుకుంది. 198 పరుగుల లక్ష్యాన్ని కాపాడుకోవడంతో ఆర్సీబీ ఘోరంగా విఫలమైంది. దీంతో గుజరాత్ టైటాన్స్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మ్యాచ్ అనంతరం ఓటమికి గల కారణాలపై కెప్టెన్ డుప్లెసిస్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మిడిలార్డర్ దినేష్ కార్తీక్ ఫేలవ ఫామ్ కారణంగా చాలా మ్యాచుల్లో ఓడిపోవాల్సి వచ్చిందని స్పష్టం చేశాడు.
ఈ సీజన్ లో నాలుగుసార్లు డకౌట్ అయిన దినేష్ కార్తీక్
అదే విధంగా ఒక్క సీజన్లో నాలుగు సార్లు డకౌట్ అయి దినేష్ కార్తీక్ ఏడో ప్లేయర్ గా చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు. సింగిల్ సీజన్లో ఎక్కువ సార్లు డకౌట్ అయిన ఆటగాడిగా జాస్ బట్లర్ అందరికంటే ముందు స్థానంలో నిలిచాడు. మ్యాచ్ విషయానికోస్తే.. శుభ్‌మన్ గిల్ అద్భుత శతకంతో గుజరాత్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. 52 బంతుల్లో 104 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. అతడికి తోడు విజయ్ శంకర్ (53) హాఫ్ సెంచరీతో రాణించడంతో గుజరాత్ సునాయాసంగా విజయం సాధించింది. అంతకుముందు ఆర్సీబీ తరుపున విరాట్ కోహ్లీ అద్భుత సెంచరీతో ఆకట్టుకున్నాడు.