LOADING...
Womens World Cup: : విజృంభించిన హీలి.. భారత్‌ను చిత్తు చేసిన ఆస్ట్రేలియా
విజృంభించిన హీలి.. భారత్‌ను చిత్తు చేసిన ఆస్ట్రేలియా

Womens World Cup: : విజృంభించిన హీలి.. భారత్‌ను చిత్తు చేసిన ఆస్ట్రేలియా

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 13, 2025
09:10 am

ఈ వార్తాకథనం ఏంటి

మహిళల ప్రపంచకప్‌లో ఆతిథ్య భారత జట్టుకు మరో నిరాశ ఎదురైంది. వరుసగా రెండో మ్యాచ్‌లో సతమతమైన భారత్‌పై డిఫెండింగ్‌ చాంపియన్‌ ఆస్ట్రేలియా ఘన విజయాన్ని నమోదు చేసింది. విశాఖపట్నంలో జరిగిన ఈ మ్యాచ్‌లో భారీ స్కోర్లు నమోదయ్యాయి. భారీ లక్ష్య ఛేదనలో ఆసీస్‌ 3 వికెట్ల తేడాతో భారత్‌పై గెలిచింది.

Details

హీలీ ధాటికి తలవంచిన భారత్ 

ఆస్ట్రేలియా కెప్టెన్‌ అలిస్సా హీలీ (107 బంతుల్లో 142 రన్స్‌, 21 ఫోర్లు, 3 సిక్స్‌లు) అద్భుత ఇన్నింగ్స్‌ ఆడుతూ భారత్‌ నిర్దేశించిన 331 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంలో కీలక పాత్ర పోషించింది. ఆమెకు తోడు ఎలిస్సె పెర్రీ (52 బంతుల్లో 47 నాటౌట్‌, 5 ఫోర్లు, 1 సిక్స్‌), ఆష్లే గార్డ్‌నర్‌ (45), లిచ్‌ఫీల్డ్‌ (40) ముఖ్య ఇన్నింగ్స్‌లు ఆడారు. 49 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి ఆస్ట్రేలియా లక్ష్యాన్ని ఛేదించింది. హీలీకి 'ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌' అవార్డు లభించింది.

Details

భారత బౌలర్లు తేలిపోయారు

భారత్‌ బౌలింగ్‌ విభాగంలో శ్రీచరణి (3/41) మాత్రమే ప్రభావం చూపింది. మిగిలిన బౌలర్లు భారీగా పరుగులిచ్చారు. టాస్‌ కోల్పోయిన తరువాత బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ జట్టు 48.5 ఓవర్లలో 330 పరుగులకు ఆలౌటైంది. స్మృతి మంధాన 66 బంతుల్లో 80 (9 ఫోర్లు, 3 సిక్స్‌లు), ప్రతీక రావల్ 96 బంతుల్లో 75 (10 ఫోర్లు, 1 సిక్స్‌) రాణించి, ఈ జోడీ తొలి వికెట్‌కు 155 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పింది.

Details

పాయింట్ల పట్టికలో ఆసీస్ ఆగ్రస్థానం

హర్లీన్‌ డియోల్ 38, జెమీమా రోడ్రిగ్స్ 33, రిచా ఘోష్ 32 పరుగులతో మెరుగ్గా రాణించారు. ఇక ఆసీస్ బౌలర్లలో అన్నాబెల్‌ సదర్లాండ్‌ 5 వికెట్లు తీసి మెరిసింది. ఈ టోర్నీలో భారత్‌కు ఇది రెండో ఓటమి. ఆసీస్‌ మూడు విజయాలతో మొత్తం 7 పాయింట్లు సాధించి పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. భారత్‌ తన తదుపరి మ్యాచ్‌ను వచ్చే ఆదివారం ఇంగ్లండ్‌తో ఆడనుంది.