SL vs IND: సిరాజ్‌తో వాగ్వాదం.. ఆ వెంటనే ప్రసిద్ధ్ బౌలింగ్‌లో కమిల్ ఔట్!
ఈ వార్తాకథనం ఏంటి
టీమిండియా, శ్రీలంక మధ్య జరుగుతున్న రెండో టెస్టు మూడో రోజు ఆటలో ఆతిథ్య జట్టు మూడో వికెట్‌ను కోల్పోయింది. ప్రసిద్ధ్ కృష్ణ వేసిన పదో ఓవర్‌లో కమిల్ మిశార(19) ఔటయ్యాడు. ఓవర్‌లోని మూడో బంతిని ఎదుర్కొనే క్రమంలో వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్‌కు క్యాచ్ ఇచ్చి కమిల్ పెవిలియన్‌కు చేరాడు. అతడి స్థానంలో కమిందు మెండిస్ క్రీజులోకి వచ్చాడు. మరో ఎండ్‌లో పసిందు(12) బ్యాటింగ్ చేస్తున్నాడు. అంతకుముందు తొమ్మిదో ఓవర్‌ను మహ్మద్ సిరాజ్ వేశాడు. ఈ ఓవర్‌లో లంక బ్యాటర్ కమిల్, సిరాజ్ మధ్య స్వల్ప వాగ్వాదం చోటుచేసుకుంది. వెంటనే అంపైర్ జోక్యం చేసుకుని సిరాజ్‌కు నచ్చజెప్పడంతో అతడు తన బౌలింగ్‌ను కొనసాగించాడు.
వివరాలు
బౌండరీలతో లంక బ్యాటర్ల ప్రతిఘటన
10 ఓవర్లు పూర్తయ్యేసరికి శ్రీలంక 35/3 స్కోరుతో ఉంది. భారత్ తొలి ఇన్నింగ్స్ స్కోరుకు లంక ఇంకా 468 పరుగుల వెనుకంజలో ఉంది.
అంతకుముందు శ్రీలంక బ్యాటర్లు కాస్త నిలకడగా బ్యాటింగ్ చేశారు. చెత్త బంతులు లభించినప్పుడల్లా బౌండరీలు బాదుతూ స్కోరును పెంచే ప్రయత్నం చేశారు.
ప్రసిద్ధ్ కృష్ణ బౌలింగ్‌లో లంక బ్యాటర్లు నాలుగు ఫోర్లు కొట్టారు. మరోవైపు మహ్మద్ సిరాజ్ పొదుపుగా బౌలింగ్ చేశాడు.
అప్పటివరకు మూడు ఓవర్లు వేసిన సిరాజ్ కేవలం మూడు పరుగులే ఇచ్చాడు. ఎనిమిది ఓవర్లు ముగిసే సమయానికి శ్రీలంక స్కోరు 31/2గా ఉంది. ఆ సమయంలో క్రీజులో కమిల్ మిశార(18), పసిందు(9) ఉన్నారు
వివరాలు
8/2తో మూడో రోజు ఆట ప్రారంభం
రెండో టెస్టు మూడో రోజు ఆట 8/2 ఓవర్‌నైట్ స్కోరుతో శ్రీలంక బ్యాటింగ్‌తో ప్రారంభమైంది. గాయం కారణంగా భారత వికెట్ కీపర్ రిషభ్ పంత్ మూడో రోజు కీపింగ్‌కు రాలేదు.
అతడి స్థానంలో ధ్రువ్ జురెల్ వికెట్ల వెనుక బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు.
అంతకుముందు రెండో రోజు ఆటలో భారత్ 503/9 స్కోరు వద్ద తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. భారత బ్యాటర్లలో దేవదత్త్ పడిక్కల్(117), ధ్రువ్ జురెల్(115) సెంచరీలతో మెరిశారు.
భారత్ ఇన్నింగ్స్ అనంతరం బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంకకు ఆరంభంలోనే వరుసగా రెండు వికెట్లు పడ్డాయి.
వివరాలు
క్రీజులో కమిందు మెండిస్, పసిందు
ప్రసిద్ధ్ కృష్ణ వేసిన రెండో ఓవర్‌లో జైస్వాల్‌కు క్యాచ్ ఇచ్చి లాహిరు(1) ఔటయ్యాడు.
ఆ తర్వాత మానవ్ సుతార్ వేసిన మూడో ఓవర్‌లో ప్రభాత్ జయసూర్య(2) ఎల్‌బీడబ్ల్యూగా వెనుదిరిగాడు.
దీంతో శ్రీలంక 20/2తో కష్టాల్లో పడింది. ఆ తర్వాత కమిల్ మిశార, పసిందు ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశారు.
అయితే ప్రసిద్ధ్ కృష్ణ మరోసారి దెబ్బకొట్టి కమిల్‌ను ఔట్ చేయడంతో శ్రీలంక 35/3కు చేరింది. ప్రస్తుతం కమిందు మెండిస్, పసిందు క్రీజులో ఉన్నారు.