Loading...
Commonwealth Games 2026: తెలుగు తేజం అజయ బాబు వీరోచిత పోరాటం.. కామన్వెల్త్‌లో భారత్‌కు మరో రజతం!
తెలుగు తేజం అజయ బాబు వీరోచిత పోరాటం.. కామన్వెల్త్‌లో భారత్‌కు మరో రజతం!

Commonwealth Games 2026: తెలుగు తేజం అజయ బాబు వీరోచిత పోరాటం.. కామన్వెల్త్‌లో భారత్‌కు మరో రజతం!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 29, 2026
09:16 am

ఈ వార్తాకథనం ఏంటి

గ్లాస్గో కామన్వెల్త్ క్రీడల్లో భారత్ పతకాల వేట కొనసాగుతోంది. తాజా విజయాలతో భారత పతకాల సంఖ్య 11కు చేరుకుంది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన యువ వెయిట్‌లిఫ్టర్ వల్లూరి అజయ బాబు రజత పతకాన్ని కైవసం చేసుకోగా.. పారా అథ్లెటిక్స్‌లో షర్మిల ధన్‌ఖడ్ స్వర్ణంతో చరిత్ర సృష్టించింది. మరోవైపు హైజంప్‌లో సర్వేశ్ కుశారే రజతం సాధించి కొత్త రికార్డు నెలకొల్పగా, వెయిట్‌లిఫ్టింగ్‌లో హర్జీందర్ కౌర్ కూడా రజతంతో మెరిసింది.

వివరాలు

తెలుగు తేజం వల్లూరి అజయ బాబు రజతం

కామన్వెల్త్ క్రీడల్లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 21 ఏళ్ల వెయిట్‌లిఫ్టర్ వల్లూరి అజయ బాబు అద్భుత ప్రదర్శనతో రజత పతకాన్ని సొంతం చేసుకున్నాడు.

పురుషుల 79 కిలోల విభాగంలో మొత్తం 330 కిలోలు ఎత్తి రెండో స్థానంలో నిలిచాడు. అజయ స్నాచ్‌లో 149కిలోలు, క్లీన్ అండ్ జెర్క్‌లో 181 కిలోలు లిఫ్ట్ చేశాడు.

మొత్తం ఆరు ప్రయత్నాల్లో ఐదుసార్లు విజయవంతమై తన ప్రతిభను చాటుకున్నాడు. ముఖ్యంగా స్నాచ్ విభాగంలో గేమ్స్ రికార్డును నెలకొల్పడం విశేషం.

అతడు చాలా వరకు స్వర్ణ పతక రేసులో ముందంజలోనే కొనసాగాడు. అయితే చివరి ప్రయత్నంలో హిదాయత్ 331 కిలోలతో గేమ్స్ రికార్డు నమోదు చేసి స్వర్ణాన్ని దక్కించుకోగా, అజయ కేవలం ఒక్క కిలో తేడాతో రజతంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

వివరాలు

షర్మిల ధన్‌ఖడ్ చరిత్ర.. భారత్‌కు తొలి పారా స్వర్ణం

ఇంగ్లాండ్‌కు చెందిన క్రిస్ ముర్రే 325 కిలోలతో కాంస్య పతకం గెలుచుకున్నాడు.

కామన్వెల్త్ క్రీడల పారా అథ్లెటిక్స్ చరిత్రలో భారత్‌కు తొలి స్వర్ణ పతకాన్ని అందించిన అథ్లెట్‌గా షర్మిల ధన్‌ఖడ్ నిలిచింది. మహిళల షాట్‌పుట్ ఎఫ్-57 విభాగంలో ఆమె 9.81 మీటర్ల అత్యుత్తమ త్రోతో అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది.

విజయం అనంతరం షర్మిల మాట్లాడుతూ, "ఈ విజయాన్ని ఇప్పటికీ నమ్మలేకపోతున్నా. నా కలలు నెరవేరేందుకు మా అమ్మ ప్రపంచంతో పోరాడింది.

ఇప్పుడు నా తదుపరి లక్ష్యం ఆసియా క్రీడల్లో స్వర్ణం గెలవడం" అని భావోద్వేగంగా చెప్పింది.

షర్మిల జీవితం స్ఫూర్తిదాయకం. రెండేళ్ల వయసులోనే పోలియో బారిన పడిన ఆమె, తర్వాత వైవాహిక జీవితంలో హింసను కూడా ఎదుర్కొంది.

ADVERTISEMENT

వివరాలు

మూడో స్థానానికి చేరి కాంస్య పతకాన్ని దక్కించుకుంది

అయినప్పటికీ ఏ కష్టానికీ లొంగకుండా తన ఆత్మస్థైర్యంతో ప్రపంచ వేదికపై విజేతగా నిలిచింది.

అదే షాట్‌పుట్ ఎఫ్-57 విభాగంలో భారత్‌కు మరో పతకం కూడా దక్కింది.

శిల్ప శైల 7.26 మీటర్ల త్రోతో కాంస్య పతకం గెలుచుకుంది.

మొదట నైజీరియాకు చెందిన లియాజి మూడో స్థానంలో నిలిచినా, భారత్ చేసిన అభ్యంతరంతో అధికారులు ఆమె త్రోను సమీక్షించి ఫౌల్‌గా ప్రకటించారు.

దీంతో నాలుగో స్థానంలో ఉన్న శిల్ప మూడో స్థానానికి చేరి కాంస్య పతకాన్ని దక్కించుకుంది.

ADVERTISEMENT

వివరాలు

హైజంప్‌లో సర్వేశ్ కుశారే రికార్డు

పురుషుల హైజంప్‌లో సర్వేశ్ కుశారే 2.25 మీటర్ల ఎత్తు దూకి రజత పతకం గెలుచుకున్నాడు. కామన్వెల్త్ క్రీడల హైజంప్‌లో రజతం సాధించిన తొలి భారత అథ్లెట్‌గా చరిత్ర సృష్టించాడు.

జమైకాకు చెందిన రొమైన్ బెక్‌ఫోర్డ్ కూడా 2.25 మీటర్లే దూకాడు. అనంతరం ఇద్దరూ 2.28 మీటర్ల ఎత్తును అందుకోలేకపోయారు.

అయితే కౌంట్‌బ్యాక్ నిబంధన ప్రకారం తక్కువ ప్రయత్నాల్లో 2.25 మీటర్లు క్లియర్ చేసిన బెక్‌ఫోర్డ్‌కు స్వర్ణం లభించింది.

ఇంగ్లాండ్‌కు చెందిన జాక్ కిమాని 2.20 మీటర్లతో కాంస్యం గెలుచుకున్నాడు. భారత అథ్లెట్ ఆదర్శ్ రామ్ 2.15 మీటర్లతో ఐదో స్థానంలో నిలిచాడు.

మరో అథ్లెట్ తేజస్విన్ తొలి ఎత్తు 2.05 మీటర్లను దాటడంలో విఫలమైన తర్వాత అసౌకర్యానికి గురై పోటీ నుంచి వైదొలిగాడు.

వివరాలు

స్విమ్మింగ్‌లో నిరాశ

స్విమ్మింగ్‌లో భారత జట్టుకు ఆశించిన ఫలితాలు రాలేదు. రెండుసార్లు ఒలింపిక్స్‌లో పాల్గొన్న సాజన్ ప్రకాశ్ పురుషుల 200 మీటర్ల బటర్‌ఫ్లై ఫైనల్లో 1:58.05 నిమిషాల టైమింగ్‌తో ఎనిమిదో స్థానంలో నిలిచాడు.

800 మీటర్ల ఫ్రీస్టైల్‌లో ఆర్యన్ నెహ్రా 8:07.26 టైమింగ్‌తో ఎనిమిదో స్థానంతో సరిపెట్టుకున్నాడు. అయితే పురుషుల 100 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్‌లో శ్రీహరి నటరాజ్ సెమీఫైనల్‌కు అర్హత సాధించాడు.

తన హీట్‌లో 55.58 సెకన్ల టైమింగ్‌తో ఐదో స్థానంలో నిలిచిన అతడు, మొత్తం మీద 13వ స్థానాన్ని దక్కించుకుని టాప్-16లో చోటు సంపాదించాడు.

పురుషుల 110 మీటర్ల హర్డిల్స్ ఫైనల్లో భారత అథ్లెట్ తేజాస్ షిర్సే చివరిదైన ఎనిమిదో స్థానంలో నిలిచాడు. అయితే ఫలితం కంటే అతని పోరాటమే అందరినీ ఆకట్టుకుంది.

వివరాలు

హర్జీందర్ కౌర్‌కు రజతం

ఫైనల్‌కు ముందు వార్మప్ సమయంలో ఎడమ పాదానికి గాయమైనప్పటికీ, పోటీ నుంచి తప్పుకోకుండా నొప్పిని భరిస్తూ రేసును పూర్తి చేశాడు.

15.6 సెకన్లలో లక్ష్యానికి చేరుకుని తన పోరాట పటిమను చాటాడు. మహిళల 69 కిలోల వెయిట్‌లిఫ్టింగ్ విభాగంలో హర్జీందర్ కౌర్ రజత పతకం సాధించింది.

ఆమె స్నాచ్‌లో 101 కిలోలు, క్లీన్ అండ్ జెర్క్‌లో 126 కిలోలు ఎత్తి మొత్తం 227 కిలోలతో రెండో స్థానంలో నిలిచింది.

అయితే మరో భారత వెయిట్‌లిఫ్టర్ నిరుపమ దేవి 63 కిలోల విభాగంలో టోటల్ నమోదు చేయడంలో విఫలమై నిరాశపరిచింది.

వివరాలు

పొలమే మైదానమై... సర్వేశ్ విజయగాథ

కామన్వెల్త్ క్రీడల్లో రజతం గెలిచిన సర్వేశ్ కుశారే ప్రయాణం అనేక కష్టాలను దాటుకుని విజయాన్ని అందుకున్న కథ.

మహారాష్ట్రలోని ఓ మధ్యతరగతి రైతు కుటుంబంలో జన్మించిన సర్వేశ్‌ను అతని తండ్రి ఇంజినీర్ చేయాలని కలలు కన్నాడు.

కుటుంబం కష్టపడి చదివించినా, చిన్నప్పటి నుంచే సర్వేశ్‌కు చదువుకంటే క్రీడలపైనే ఆసక్తి ఎక్కువగా ఉండేది.

మొదట తన కుమారుడి నిర్ణయాన్ని వ్యతిరేకించిన తండ్రి, అతనిలోని ప్రతిభను గుర్తించి మద్దతు ఇచ్చాడు.

ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఖరీదైన శిక్షణ కేంద్రాలకు పంపలేక, ఇంటి పొలంలోనే హైజంప్ సాధనకు ఏర్పాట్లు చేశాడు.

కర్రలతో హైజంప్ పిట్ నిర్మించి, మొక్కజొన్న ఆకులు, గడ్డి,పాత బట్టలతో ల్యాండింగ్ ప్రదేశాన్ని సిద్ధం చేశాడు. అదే పొలం సర్వేశ్‌కు తొలి శిక్షణ మైదానంగా మారింది.

వివరాలు

అత్యుత్తమ ఫలితం నమోదు

అక్కడి నుంచి జాతీయ స్థాయికి ఎదిగిన సర్వేశ్ 2016లో 2.15 మీటర్ల ఎత్తు దూకాడు. మూడు సంవత్సరాల తర్వాత 2.26 మీటర్లతో తన ప్రతిభను మరింత నిరూపించాడు.

అయితే ఆ తర్వాత ఆరేళ్ల పాటు అతని ప్రదర్శనలో పెద్దగా మెరుగుదల కనిపించలేదు.

గతేడాది టోక్యోలో జరిగిన ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్స్‌లో 2.28 మీటర్లతో కెరీర్ బెస్ట్ ప్రదర్శన నమోదు చేసి ఆరో స్థానంలో నిలిచాడు.

పతకం సాధించకపోయినా, ప్రపంచ ఛాంపియన్‌షిప్స్‌లో భారత హైజంప్ చరిత్రలోనే అత్యుత్తమ ఫలితాన్ని నమోదు చేశాడు.

వివరాలు

తొలి భారతీయుడిగా చరిత్ర

ఈ ఏడాది అంతర్ రాష్ట్ర అథ్లెటిక్స్ పోటీల్లో 2.31 మీటర్ల ఎత్తు దూకి ఎనిమిదేళ్లుగా చెక్కుచెదరని జాతీయ రికార్డును బద్దలు కొట్టాడు.

2.30 మీటర్ల మార్కును అందుకున్న తొలి భారత హైజంపర్‌గా నిలిచాడు. అలాగే డైమండ్ లీగ్‌లో పోటీ పడిన తొలి భారత హైజంపర్‌గా మరో ఘనత సాధించాడు.

ఇప్పుడు కామన్వెల్త్ క్రీడల్లో హైజంప్ రజతం గెలిచిన తొలి భారతీయుడిగా చరిత్ర సృష్టించాడు. ఈ పోటీలో తన వ్యక్తిగత అత్యుత్తమ ప్రదర్శనను అందుకుని ఉంటే, స్వర్ణ పతకం కూడా అతని ఖాతాలో చేరేది.

వివరాలు

జాతీయ రికార్డు బద్దలు

ఈ ఏడాది అంతర్ రాష్ట్ర అథ్లెటిక్స్ పోటీల్లో 2.31 మీటర్ల ఎత్తు దూకి ఎనిమిదేళ్లుగా చెక్కుచెదరని జాతీయ రికార్డును బద్దలు కొట్టాడు.

2.30 మీటర్ల మార్కును అందుకున్న తొలి భారత హైజంపర్‌గా నిలిచాడు. అలాగే డైమండ్ లీగ్‌లో పోటీ పడిన తొలి భారత హైజంపర్‌గా మరో ఘనత సాధించాడు.

ఇప్పుడు కామన్వెల్త్ క్రీడల్లో హైజంప్ రజతం గెలిచిన తొలి భారతీయుడిగా చరిత్ర సృష్టించాడు.

ఈ పోటీలో తన వ్యక్తిగత అత్యుత్తమ ప్రదర్శనను అందుకుని ఉంటే, స్వర్ణ పతకం కూడా అతని ఖాతాలో చేరేది.

ADVERTISEMENT