Page Loader
టెస్టులో చరిత్రను నెలకొల్పిన జేమ్స్ అండర్సన్
న్యూజిలాండ్ జరిగిన మొదటి టెస్టులో రెండు వికెట్లు పడగొట్టిన అండర్సన్

టెస్టులో చరిత్రను నెలకొల్పిన జేమ్స్ అండర్సన్

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 16, 2023
04:04 pm

ఈ వార్తాకథనం ఏంటి

వెటరన్ ఇంగ్లండ్ పేసర్ జేమ్స్ ఆండర్సన్ న్యూజిలాండ్‌తో జరుగుతున్న ఓపెనింగ్ టెస్ట్‌లో చరిత్ర సృష్టించాడు, 21 సంవత్సరాలుగా అంతర్జాతీయ వికెట్లు తీస్తున్న మొదటి బౌలర్‌గా నిలిచాడు. డే-నైట్ మొదటి ఇన్నింగ్స్ లో ప్రారంభంలోనే జేమ్స్ అండర్సన్ రెండు వికెట్లను పడగొట్టాడు. గత రెండు దశాబ్దాలుగా అండర్సన్ టెస్టుల్లో తనదైన ముద్రను వేసుకున్నాడు. ప్రస్తుతం ICC టెస్ట్ ర్యాంకింగ్స్‌లో అండర్సన్ మూడోస్థానంలో కొనసాగుతుండడం విశేషం. డిసెంబరు 2002లో ఆస్ట్రేలియాతో జరిగిన వన్డేలో అండర్సన్ అంతర్జాతీయ అరంగేట్రం చేసాడు. అప్పటి నుండి అంతర్జాతీయ మ్యాచ్ లు ఆడి వికెట్లను సాధిస్తున్నాడు.

అండర్సన్

టెస్టులో అత్యధిక వికెట్లు తీసిన మూడో బౌలర్ నిలిచిన అండర్సన్

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 58.2 ఓవర్లలో 325/9 వద్ద డిక్లేర్ చేసింది. కేన్ విలియమ్సన్ (6), హెన్రీ నికోల్స్ (4)లను అండర్సన్ త్వరగా ఔట్ చేశాడు. ఫలితంగా తొలి రోజు ఆట ముగిసే సమయానికి కివీస్‌ మూడు వికెట్ల నష్టానికి 37 పరుగులు చేసింది. ఇప్పటివరకూ 178 టెస్టులు ఆడిన అండర్సన్ 677 వికెట్లు తీసి, టెస్టులో అత్యధిక వికెట్లు తీసిన మూడో బౌలర్ గా నిలిచాడు. ముత్తయ్య మురళీధరన్ (800), షేన్ వార్న్ (708) అతని కంటే ముందు ఉన్నారు. గత ఏడాది ఇంగ్లండ్‌ తరుపున అరంగేట్రం చేసిన ఆల్‌రౌండర్ రెహాన్ అహ్మద్ జన్మించిన రెండేళ్ల తర్వాత ఆండర్సన్ తన అంతర్జాతీయ అరంగేట్రం చేయడం విశేషం.