Loading...
IND vs WI: హోప్‌ అజేయ శతకం.. భారత్‌పై 5 వికెట్ల తేడాతో విండీస్‌ గెలుపు
హోప్‌ అజేయ శతకం.. భారత్‌పై 5 వికెట్ల తేడాతో విండీస్‌ గెలుపు

IND vs WI: హోప్‌ అజేయ శతకం.. భారత్‌పై 5 వికెట్ల తేడాతో విండీస్‌ గెలుపు

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 04, 2026
09:52 am

ఈ వార్తాకథనం ఏంటి

మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా టీమిండియాతో జరిగిన మూడో వన్డేలో వెస్టిండీస్‌ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. కెప్టెన్‌ ఇన్నింగ్స్‌తో అదరగొట్టిన విండీస్‌ కెప్టెన్‌ శాయ్‌ హోప్‌ అజేయ శతకంతో చివరి వరకు క్రీజులో నిలిచి జట్టుకు విజయాన్ని అందించాడు. అయితే తొలి రెండు వన్డేల్లో విజయాలు సాధించిన భారత్‌.. సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకుంది.

వివరాలు

351 పరుగులు చేసిన భారత్

టాస్‌ అనంతరం తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 351 పరుగులు చేసింది. కేఎల్‌ రాహుల్‌ అజేయ శతకంతో చెలరేగిపోయాడు.

అతడు 87బంతుల్లో 10 ఫోర్లు, 6 సిక్స్‌లతో 129* పరుగులు చేశాడు. రోహిత్‌ శర్మ కూడా కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు. 85 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్స్‌లతో 92 పరుగులు చేసి శతకానికి చేరువగా నిలిచాడు.

రుతురాజ్‌ గైక్వాడ్‌ 69 బంతుల్లో ఒక ఫోర్‌, 4 సిక్స్‌లతో 57 పరుగులు చేశాడు. నమన్‌ ధీర్‌ 30 పరుగులు సాధించాడు.

వెస్టిండీస్‌ బౌలర్లలో జేడెన్‌ సీల్స్‌ 3 వికెట్లు పడగొట్టగా.. కీమో పాల్‌ 2 వికెట్లు తీశాడు. గుడకేశ్‌ మోటీ ఒక వికెట్‌ సాధించాడు.

వివరాలు

హోప్‌ అజేయ శతకంతో విండీస్‌ గెలుపు

351 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్‌ 48.2 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. కెప్టెన్‌ శాయ్‌ హోప్‌ అద్భుతమైన బ్యాటింగ్‌తో అజేయ శతకం నమోదు చేసి జట్టు విజయానికి ప్రధాన కారణంగా నిలిచాడు.

హోప్‌ 143 బంతుల్లో 17 ఫోర్లు, 3 సిక్స్‌లతో 162* పరుగులు చేసి చివరి వరకు నాటౌట్‌గా నిలిచాడు. ఆమిర్‌ జాంగూ కూడా అర్ధశతకంతో రాణించాడు.

అతడు 56 బంతుల్లో 5 ఫోర్లు, ఒక సిక్స్‌తో 67 పరుగులు చేశాడు. కీమో పాల్‌ 44 పరుగులు సాధించాడు. భారత బౌలర్లలో సిరాజ్‌, బ్రార్‌, కుల్‌దీప్‌, నమన్‌ ధీర్‌ తలో వికెట్‌ పడగొట్టారు.

ADVERTISEMENT