
Rishabh Pant : పంత్‌తో 10-12 ఏళ్ల పాటు పని చేయాలని ఆశిస్తున్నా : సంజీవ్ గొయెంకా
ఈ వార్తాకథనం ఏంటి
ఐపీఎల్ మెగా వేలంలో రిషబ్ పంత్ అరుదైన చరిత్ర సృష్టించాడు.
గతంలో దిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్‌గా వ్యవహరించిన ఈ యువ క్రికెటర్‌ను లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ ఏకంగా రూ.27 కోట్లకు కొనుగోలు చేసింది.
దీనిపై లఖ్‌నవూ యజమాని సంజీవ్ గొయెంకా స్పందించారు. తమ జట్టు వేలంలో అనుసరించిన వ్యూహం చాలా సంతృప్తిగా ఉందని వెల్లడించారు.
బ్యాటింగ్ విభాగంలో విదేశీ విధ్వంసకర ఆటగాళ్లను తీసుకుని జట్టును సమతూకంగా మలిచామన్నారు.
మూడో స్థానం నుంచి ఎనిమిదో స్థానం వరకు బలమైన జట్టును ఏర్పాటు చేశామని, ఇది ఎంతో కీలకమన్నారు. గొయెంకా టీమ్ సారథి విషయంలో ఇంకా క్లారిటీ ఇవ్వలేదు.
Details
మా జట్టులో నలుగురు లీడర్లు ఉన్నారు
ప్రస్తుతం రేసులో ఉన్నవారిలో రిషభ్ పంత్, నికోలస్ పూరన్, మార్‌క్రమ్, మిచెల్ మార్ష్ ఉన్నట్లు చెప్పారు.
తమ జట్టులో నలుగురు లీడర్లు ఉన్నారని, వీరందరూ గెలుపే లక్ష్యంగా పని చేసే సామర్థ్యం ఉందని చెప్పారు.
రోడ్డు ప్రమాదం తర్వాత పంత్ తిరిగి జట్టులో చేరడం, అతని ప్రదర్శన గొప్పగా ఉందని గొయెంకా అన్నారు.
పంత్ ఇప్పుడు మరింత చైతన్యంగా కనిపిస్తున్నారని, రాబోయే 10-12 సంవత్సరాలు లక్నో టీమ్‌లో ఉంటారని వెల్లడించారు.
వేలంలో రిషభ్ పంత్ రూ.27 కోట్లు, నికోలస్ పూరన్ రూ.21 కోట్లు, మిచెల్ మార్ష్ రూ.3.40 కోట్లు, మార్‌క్రమ్ రూ.2 కోట్లు పెట్టి కొనుగోలు చేశారు.