LOADING...
Gurindervir singh: 10.09 సెకన్లలో చరిత్ర.. భారత ఫాస్టెస్ట్ రన్నర్‌గా గుర్విందర్ సింగ్
10.09 సెకన్లలో చరిత్ర.. భారత ఫాస్టెస్ట్ రన్నర్‌గా గుర్విందర్ సింగ్

Gurindervir singh: 10.09 సెకన్లలో చరిత్ర.. భారత ఫాస్టెస్ట్ రన్నర్‌గా గుర్విందర్ సింగ్

వ్రాసిన వారు Moogati Shabari
May 30, 2026
04:29 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారత అథ్లెటిక్స్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిన పేరు మిల్కా సింగ్. 'ఫ్లైయింగ్ సిఖ్'గా ఖ్యాతి గడించిన ఆయన ట్రాక్ అండ్ ఫీల్డ్‌లో ఎన్నో మైలురాళ్లు నెలకొల్పారు. ఆ తరువాత అనిమేష్ కుజుర్ వంటి ప్రతిభావంతమైన స్ప్రింటర్లు దేశానికి గుర్తింపు తీసుకువచ్చారు. ఇప్పుడు అదే సంప్రదాయాన్ని కొనసాగిస్తూ గుర్విందర్ సింగ్ అనే యువ అథ్లెట్ కొత్త చరిత్రను సృష్టించాడు. 100 మీటర్ల పరుగు పందెంలో అసాధారణ ప్రదర్శనతో భారత్ తరఫున అత్యంత వేగంగా పరుగెత్తిన అథ్లెట్‌గా నిలిచాడు.

వివరాలు

24 గంటల్లో మూడుసార్లు మారిన రికార్డు..

కేవలం ఒకే రోజు వ్యవధిలో భారత ఫాస్టెస్ట్ మాన్ రికార్డు మూడుసార్లు మారడం విశేషం. మొదట హీట్స్‌లో గుర్విందర్ సింగ్ 100 మీటర్ల రేసును 10.17 సెకన్లలో పూర్తి చేసి, గత ఏడాది అనిమేష్ కుజుర్ నమోదు చేసిన 10.18 సెకన్ల రికార్డును అధిగమించాడు. అయితే కొద్దిసేపటికే అనిమేష్ తన ప్రదర్శనను మరింత మెరుగుపరుచుకుని 10.15 సెకన్లలో రేసును ముగించాడు. దీంతో తన సొంత జాతీయ రికార్డును తిరిగి సాధించడమే కాకుండా, కొత్త ప్రమాణాన్ని కూడా నెలకొల్పాడు. అతడు కేవలం 10.09 సెకన్లలో 100 మీటర్ల రేసును పూర్తి చేసి, 10.10 సెకన్లలోపు ఈ దూరాన్ని పూర్తి చేసిన తొలి భారతీయ అథ్లెట్‌గా చరిత్రలో నిలిచిపోయాడు.

వివరాలు

పేదరికం నుంచి దేశ అత్యంత వేగవంతమైన రన్నర్‌గా..

పంజాబ్‌లోని ఒక మారుమూల ప్రాంతానికి చెందిన గుర్విందర్ సింగ్ సాధారణ కుటుంబంలో జన్మించాడు. కుటుంబ ఆర్థిక పరిస్థితులు అనేక కష్టాలను ఎదుర్కొన్నాయి. సరైన రన్నింగ్ షూస్ కూడా కొనలేని పరిస్థితుల్లో పెరిగిన అతడు, నేడు దేశంలోనే అత్యంత వేగవంతమైన అథ్లెట్‌గా గుర్తింపు పొందడం విశేషం. తన క్రీడా ప్రయాణాన్ని గుర్తు చేసుకుంటూ గుర్విందర్ సింగ్ భావోద్వేగంగా స్పందించాడు.

Advertisement

వివరాలు

తండ్రి ప్రోత్సాహమే విజయానికి బలం..

"మా తండ్రి పంజాబ్ పోలీస్ శాఖలో ఉద్యోగం చేసేవారు. మా తల్లి గృహిణి. నేను పోటీల్లో పాల్గొనాలంటే స్పైక్ షూస్ కొనడం నుంచి శిక్షణ ఫీజులు చెల్లించడం వరకు ప్రతి దశలో ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యేవి. అథ్లెట్ల జీవితంలో చాలా సందర్భాల్లో వారు ఒంటరిగానే పోరాడాల్సి వస్తుంది. స్టేడియం బయట వారి కోసం ఎదురుచూసేవారు కూడా చాలా తక్కువమంది ఉంటారు. కానీ నా సామర్థ్యంపై మా తండ్రి ఎప్పుడూ నమ్మకం కోల్పోలేదు. ప్రతిరోజూ తెల్లవారుజామున నన్ను ట్రాక్‌కు తీసుకెళ్లి ప్రోత్సహించేవారు.

Advertisement

వివరాలు

పేదరికం, అనారోగ్యం, ఆర్థిక ఇబ్బందులు అధిగమించి..

అయితే మూడేళ్ల క్రితం నేను తీవ్ర అనారోగ్యానికి గురయ్యాను. దాదాపు ఏడాది పాటు ట్రాక్‌కు దూరంగా ఉండాల్సి వచ్చింది. కోలుకున్న తర్వాత 2024 ఫెడ్ కప్‌లో తిరిగి పోటీల్లో అడుగుపెట్టాను. అనంతరం రిలయన్స్ ఫౌండేషన్‌లో చేరిన తర్వాత నా ప్రదర్శనలో గణనీయమైన మార్పు వచ్చింది. గత ఏడాది మార్చిలో ఇండియన్ గ్రాండ్ ప్రిక్స్‌లో 10.20 సెకన్ల టైమింగ్ నమోదు చేశాను. ఇప్పుడు 100 మీటర్ల పరుగు పందెంను 10.09 సెకన్లలో పూర్తి చేసి స్వర్ణ పతకాన్ని గెలుచుకోవడం ఎంతో ఆనందంగా ఉంది" అని గుర్విందర్ వివరించాడు. పేదరికం, అనారోగ్యం, ఆర్థిక ఇబ్బందులు వంటి ఎన్నో అవరోధాలను అధిగమించి భారత స్ప్రింటింగ్‌లో కొత్త అధ్యాయాన్ని రాశారు గుర్విందర్ సింగ్.

Advertisement