
Team India: టీమిండియాలో స్టార్ ఆటగాళ్లు ఎక్కువ.. బుమ్రా, హార్దిక్ పాండ్య అసలు మ్యాచ్ విన్నర్లు!
ఈ వార్తాకథనం ఏంటి
ప్రతిష్ఠాత్మకమైన ఆసియా కప్ (Asia Cup) మరో కొద్ది గంటల్లోనే యూఏఈ వేదికగా ఆరంభం కానుంది. ఈ టోర్నీలో తొలి మ్యాచ్ అఫ్గానిస్థాన్, హాంకాంగ్ జట్ల మధ్య జరుగనుంది. సెప్టెంబర్ 10న రెండో మ్యాచ్‌లో భారత జట్టు (Team India) యూఏఈతో తలపడనుంది. భారత జట్టు ఇంతకుముందు యూఏఈతో కేవలం ఒక్కసారే తలపడ్డది. 2016 ఆసియా కప్‌లో జరిగిన ఆ మ్యాచ్ తర్వాత దాదాపు పది సంవత్సరాల తర్వాత మళ్లీ ఇరు జట్లు తలపడుతున్నాయి. ఈ సారి టీమ్‌ఇండియాకు సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav), యూఏఈకి మహ్మద్ వసీమ్ (Muhammad Waseem) నాయకత్వం వహిస్తున్నారు. భారత జట్టు సూపర్‌స్టార్స్‌తో నిండిపోయి ఉందని యూఏఈ ఓపెనర్ అలీషాన్ షరాఫు (Alishan Sharafu) ప్రశంసించాడు.
Details
భారత్ తో తలపడేందుకు సిద్ధంగా ఉన్నాం
టీమ్‌ఇండియాలో ప్రతి ఒక్కరూ క్వాలిటీ ప్లేయర్స్. ముఖ్యంగా జస్‌ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah), హార్దిక్ పాండ్య (Hardik Pandya) లాంటి ఆటగాళ్లు మ్యాచ్ విన్నర్స్. వారు ఫలితాన్ని ఒక్కసారిగా మార్చగలరు. వారితో తలపడటానికి నేను ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని అన్నాడు. తాజాగా అఫ్గానిస్థాన్, పాకిస్థాన్‌లతో ముగిసిన ముక్కోణపు సిరీస్‌లో తమ జట్టు ఆటతీరు గురించి కూడా షరాఫు ప్రస్తావించాడు. ఆ సిరీస్‌లో యూఏఈ ఒక్క మ్యాచ్ కూడా గెలవకపోయినా, చివరి మ్యాచ్‌లో అఫ్గానిస్థాన్‌పై విజయం సాధించే స్థాయికి చేరుకుందని గుర్తుచేశాడు. ఆ మ్యాచ్‌లో కేవలం నాలుగు పరుగుల తేడాతోనే అఫ్గానిస్థాన్ గెలిచిందని ఆయన చెప్పారు.