
Tilak Varma: రంజీ ట్రోఫీకి హైదరాబాద్ జట్టును ప్రకటించిన హెచ్‌సీఏ.. కెప్టెన్‌గా తిలక్ వర్మ
ఈ వార్తాకథనం ఏంటి
భారత క్రికెట్‌లో కొత్త యువ తారగా వెలుగు చూసిన తిలక్ వర్మకు కీలక బాధ్యతలు లభించాయి. 2025-26 రంజీ ట్రోఫీ సీజన్‌లో హైదరాబాద్ క్రికెట్ జట్టుకు ఆయన నేతృత్వం వహించబోతున్నారని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ)అధికారికంగా ప్రకటించింది. ఈనియామకం తిలక్ వర్మకు ప్రత్యేక గౌరవం గా భావించవచ్చు. ఈసీజన్‌లో భాగంగా ఢిల్లీ, పుదుచ్చేరి, హిమాచల్ ప్రదేశ్‌తో జరగనున్న తొలి మూడు మ్యాచ్‌ల కోసం 15 మంది సభ్యులతో కూడిన జట్టును సెలక్టర్లు ఎంపిక చేశారు. తిలక్ వర్మ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టగా,రాహుల్ సింగ్ వైస్-కెప్టెన్‌గా ఎంపిక అయ్యాడు. తాజాగా,తిలక్ వర్మ ఆసియా కప్ 2025 ఫైనల్‌లో పాకిస్తాన్‌పై చేసిన మ్యాచ్-విన్నింగ్ ఇన్నింగ్స్ ద్వారా క్రీడాభిమానుల హృదయాల్లో తన స్థానాన్ని మరింత పటిష్టం చేసుకున్నాడు.
వివరాలు
దేశవాళీ టోర్నీలోనూ జట్టును ముందుండి నడిపించనున్న తిలక్
ఆ గొప్ప ప్రదర్శన తరువాత, ఆయన దేశవాళీ మైదానాల్లో జట్టును ముందుండి నడిపించడానికి సిద్ధమవుతున్నారు. జట్టులో అనుభవజ్ఞులైన ఆటగాళ్లుగా తన్మయ్ అగర్వాల్, సీవీ మిలింద్, రోహిత్ రాయుడు తదితరులు ఉన్నారు. వికెట్ కీపర్లుగా అలీ కచీ డైమండ్, రాహుల్ రాదేశ్‌లను ఎంపిక చేసినట్లు హెచ్‌సీఏ తెలిపింది. జట్టు వివరాలు: తిలక్ వర్మ (కెప్టెన్),రాహుల్ సింగ్ (వైస్ కెప్టెన్),సీవీ మిలింద్,తన్మయ్ అగర్వాల్, ఎం. అభిరత్ రెడ్డి, హిమతేజ,వరుణ్ గౌడ్,తనయ్ త్యాగరాజన్,రోహిత్ రాయుడు, శరణు నిశాంత్, పున్నయ్య, అనికేత్ రెడ్డి, కార్తికేయ కాక్, అలీ కచీ డైమండ్ (వికెట్ కీపర్), రాహుల్ రాదేశ్ (వికెట్ కీపర్). స్టాండ్‌బై ఆటగాళ్లు: పి. నితీశ్ రెడ్డి, సాయి ప్రజ్ఞయ్ రెడ్డి, రక్షణ్ రెడ్డి, నితేశ్ కనల, మిఖిల్ జైస్వాల్.