LOADING...
SRH vs RR: హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో అనూహ్య ఘటన.. లైట్లు ఆగిపోవడంతో గందరగోళం
హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో అనూహ్య ఘటన.. లైట్లు ఆగిపోవడంతో గందరగోళం

SRH vs RR: హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో అనూహ్య ఘటన.. లైట్లు ఆగిపోవడంతో గందరగోళం

వ్రాసిన వారు Moogati Shabari
Apr 13, 2026
11:00 pm

ఈ వార్తాకథనం ఏంటి

హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో సన్‌ రైజర్స్ హైదరాబాద్ (SRH), రాజస్థాన్ రాయల్స్ (RR) మధ్య నేడు జరిగిన మ్యాచ్‌లో అనూహ్యమైన సంఘటన చోటుచేసుకుంది. మ్యాచ్ అత్యంత ఉత్కంఠభరితంగా సాగుతున్న సమయంలో ఒక్కసారిగా స్టేడియంలోని లైట్లు ఆగిపోవడంతో ఆటగాళ్లు, ప్రేక్షకులు ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు. ప్రపంచంలో అత్యంత ఖరీదైన క్రికెట్ లీగ్‌లో ఇలాంటి సాంకేతిక లోపాలు జరగడంపై అభిమానులు సోషల్ మీడియాలో తీవ్రంగా స్పందిస్తూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

లైటింగ్ లేకుండా చీకట్లోనే స్టేడియం..

వివరాలు

ఆటకు అంతరాయం..

హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో సన్‌రైజర్స్ బ్యాటర్లు ఇషాన్ కిషన్, హెన్రిచ్ క్లాసెన్ రాజస్థాన్ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటున్న సమయంలో ఈ అంతరాయం సంభవించింది. ఇన్నింగ్స్ 13వ ఓవర్ పూర్తైన వెంటనే స్టేడియంలోని విద్యుత్ దీపాలు కొన్ని సెకన్ల పాటు పూర్తిగా ఆగిపోయాయి. దీంతో ఒక్కసారిగా మైదానం మొత్తం చీకటిలో మునిగిపోయింది. మైదానంలో ఉన్న ఆటగాళ్లు ఏమి జరుగుతుందో అర్థం కాక కొద్దిసేపు అలాగే నిలిచిపోయారు. తర్వాత వెంటనే లైట్లు తిరిగి వచ్చినప్పటికీ, ఆ చిన్న విరామం వల్ల ఆటకు అంతరాయం తప్పలేదు.

Advertisement

ట్విట్టర్ పోస్ట్ చేయండి

వైరల్ అవుతున్న పోస్ట్: 

Advertisement

వివరాలు

ఒత్తిడిలో హైదరాబాద్ జట్టు..

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ మొదట బౌలింగ్ ఎంచుకుంది. మొదటి బంతికే అభిషేక్ శర్మ వికెట్ కోల్పోవడంతో హైదరాబాద్ జట్టు ఒత్తిడిలో పడింది. అలాగే ట్రావిస్ హెడ్ కూడా తక్కువ స్కోరుకే వెనుదిరగడంతో జట్టు పరిస్థితి మరింత కష్టంగా మారింది. అయితే ఇషాన్ కిషన్, హెన్రిచ్ క్లాసెన్ కలిసి 88 పరుగుల భాగస్వామ్యంతో జట్టును తిరిగి నిలబెట్టారు. జట్టు మంచి దూకుడుతో ఉన్న సమయంలో ఈ విద్యుత్ అంతరాయం చోటుచేసుకోవడం బ్యాట్స్‌మెన్ ఏకాగ్రతపై ప్రభావం చూపిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Advertisement