Page Loader
AUS vs IND: "ఆ నిర్ణయాలను జడ్జ్‌ చేయడం నా పని కాదు".. హర్షిత్ రాణా ఎంపికపై వివాదంపై కపిల్ దేవ్ 
హర్షిత్ రాణా ఎంపికపై వివాదంపై కపిల్ దేవ్

AUS vs IND: "ఆ నిర్ణయాలను జడ్జ్‌ చేయడం నా పని కాదు".. హర్షిత్ రాణా ఎంపికపై వివాదంపై కపిల్ దేవ్ 

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 11, 2024
10:46 am

ఈ వార్తాకథనం ఏంటి

ఆస్ట్రేలియాతో జరిగిన పర్యటనలో (AUS vs IND) ఇద్దరు కొత్త క్రికెటర్లు అరంగేట్రం చేసారు. అందులో ఒకరు తెలుగు కుర్రాడు నితీశ్‌ కుమార్‌ రెడ్డి, మరొకరు హర్షిత్‌ రాణా. వీరిద్దరిలో నితీశ్‌ మంచి ప్రదర్శన కనబరిచాడు, అయితే హర్షిత్ మాత్రం తొలి టెస్టులో ఫర్వాలేదనిపించినా... గులాబీ టెస్టులో మాత్రం పెద్దగా సక్సెస్ కాలేదు. ఈ పరిస్థితిలో, తుది జట్టులో ఆకాశ్‌ దీప్‌ లేదా ప్రసిధ్‌ కృష్ణను ఎంపిక చేయాలని డిమాండ్లు కూడా ఉన్నాయి. కొందరు హర్షిత్‌ కోల్‌కతా నైట్‌రైడర్స్‌ (KKR) జట్టులో సభ్యుడుగా ఉండటంతో అతడికి అవకాశం ఇచ్చారంటూ విమర్శలు చేశారు.

వివరాలు 

భారత జట్టు మాజీ సభ్యులే ఈ నిర్ణయాలు తీసుకుంటారు: కపిల్ 

ఈ విమర్శలపై భారత క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ స్పందిస్తూ, "భారత మేనేజ్‌మెంట్ తీసుకునే నిర్ణయాలు నా జడ్జిమెంట్‌కు సంబంధించినవి కాదు. నా వ్యాఖ్యలు వాటిపై పెద్ద ప్రభావం చూపించవు. నేను ఎలాంటి అధికారం లేని వ్యక్తిని, కాబట్టి జట్టులో ఎవరు ఉండాలో నిర్ణయించేది మేనేజ్‌మెంట్. నేను ఆశిస్తున్నది జట్టు ఎంపికలో సరైన నిర్ణయాలు తీసుకోవడమే. ఇలాంటి విషయాలను మనం చర్చించకూడదు, ఎందుకంటే భారత జట్టు మాజీ సభ్యులే ఈ నిర్ణయాలు తీసుకుంటారు," అని పేర్కొన్నాడు.

వివరాలు 

హర్షిత్ కంటే ఆకాశ్‌ ఉంటే బాగుండు: మంజ్రేకర్ 

మరోవైపు, సంజయ్ మంజ్రేకర్ కూడా మాట్లాడుతూ, "గులాబీ టెస్టులో హర్షిత్‌ రాణా పెద్దగా ప్రభావం చూపలేదు, కానీ ఆకాశ్‌ దీప్‌ ఇక్కడ బెస్ట్ ఆప్షన్ కావచ్చు. గబ్బా టెస్టులో నాలుగో పేసర్‌గా ఆకాశ్‌ దీప్‌ సరైన ఎంపిక. మేనేజ్‌మెంట్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో తెలియదు, కానీ తుది జట్టు ఎంపిక చాలా జాగ్రత్తగా ఉండాలి," అని సూచించాడు.