LOADING...
Sanju Samson: కొత్త ప్రణాళికతోనే తిరిగి ఫామ్‌లోకి వచ్చా: సంజు శాంసన్
కొత్త ప్రణాళికతోనే తిరిగి ఫామ్‌లోకి వచ్చా: సంజు శాంసన్

Sanju Samson: కొత్త ప్రణాళికతోనే తిరిగి ఫామ్‌లోకి వచ్చా: సంజు శాంసన్

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 10, 2026
01:58 pm

ఈ వార్తాకథనం ఏంటి

తాజా టీ20 ప్రపంచకప్‌లో మెరిసిన స్టార్‌ బ్యాటర్ సంజు శాంస‌న్‌ తన విజయానికి వెనుక ఉన్న ప్రయాణాన్ని వెల్లడించాడు. వరుస వైఫల్యాల తర్వాత కొత్త ప్రణాళికతో ముందుకు సాగానని, అదే తిరిగి ఫామ్‌లోకి రావడానికి సహాయపడిందని తెలిపాడు. 'మొదట్లో ప్రతి బంతినీ భారీ షాట్‌గా మార్చాలని ప్రయత్నించాను. కానీ ఆశించిన ఫలితాలు రాలేదు. అప్పుడు నా వైఫల్యాలను విశ్లేషించి వాటి నుంచి నేర్చుకున్నాను. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో స్ట్రైక్‌రేట్‌ను పెంచుకోవాలని ప్రయత్నించాను. అయితే ఆ ప్రయత్నం కూడా ఆశించిన విధంగా పనిచేయలేదు.

Details

స‌చిన్ మాట్లాడటం ఎంతో ధైర్యం ఇచ్చింది 

చివరికి ప్రపంచకప్‌కు పూర్తిగా భిన్నమైన గేమ్‌ప్లాన్‌తో సిద్ధమయ్యానుని శాంసన్‌ వివరించాడు. ఫామ్‌ కోల్పోయిన సమయంలో తాను భారత క్రికెట్ దిగ్గజం స‌చిన్ టెండూల్క‌ర్ ను సంప్రదించినట్లు తెలిపాడు. ఆయనతో మాట్లాడటం తనకు ఎంతో ధైర్యం ఇచ్చిందని, ఆటపై కొత్త దృక్పథాన్ని అందించిందని చెప్పాడు. ఇక ఆటగాళ్లపై సోషల్‌ మీడియా ప్రభావం ఎక్కువగా ఉంటుందని శాంసన్‌ అభిప్రాయపడ్డాడు. అది కొన్ని సందర్భాల్లో సానుకూలంగా ఉంటే, మరికొన్ని సందర్భాల్లో ప్రతికూల ప్రభావం చూపుతుందని పేర్కొన్నాడు. అందుకే గత నెల రోజులుగా తన మొబైల్‌ను పక్కన పెట్టి ఆటపై పూర్తిగా దృష్టి పెట్టినట్లు శాంసన్‌ వెల్లడించాడు.

Advertisement