Dale Steyn: అతడికి బౌలింగ్ చేయడమంటే ఇష్టం.. అందుకే 16సార్లు ఔట్ చేశా: స్టెయిన్
ఈ వార్తాకథనం ఏంటి
దక్షిణాఫ్రికా మాజీ పేసర్ డేల్ స్టెయిన్ (Dale Steyn) ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన బౌలర్లలో ఒకడిగా గుర్తింపు పొందాడు. వసీమ్ అక్రమ్, వకార్ యూనిస్, గ్లెన్ మెక్‌గ్రాత్, కర్ట్లీ ఆంబ్రోస్ వంటి దిగ్గజాల తరహాలో మంచి పేస్‌తో పాటు దూకుడైన బౌలింగ్‌తో ప్రత్యర్థి బ్యాటర్లను ఇబ్బంది పెట్టేవాడు. ఇప్పటికీ ఏదైనా సెర్చ్ ఇంజిన్‌లో టాప్-5 పేసర్ల గురించి వెతికితే డేల్ స్టెయిన్ పేరు కూడా ఆ జాబితాలో కనిపిస్తుంది. దక్షిణాఫ్రికా తరఫున స్టెయిన్ 93 టెస్టులు, 125 వన్డేలు, 47 టీ20లు ఆడాడు. మూడు ఫార్మాట్లలో కలిపి మొత్తం 699వికెట్లు పడగొట్టాడు. ఇలాంటి దిగ్గజ పేసర్‌ను సమర్థంగా ఎదుర్కొన్న బ్యాటర్లు కూడా ఉన్నారు. స్టెయిన్ బౌలింగ్‌కు వచ్చాడంటే పెవిలియన్‌కు చేరిన బ్యాటర్లు లేకపోలేదు.
వివరాలు
పాక్‌కు చెందిన మాజీ బ్యాటర్ మహ్మద్ హఫీజ్ పేరు ప్రస్తావన
ఈ క్రమంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో స్టెయిన్‌కు ఓ ఆసక్తికరమైన ప్రశ్న ఎదురైంది.
మాజీ క్రికెటర్ వెర్నాన్ ఫిలాండర్ ''ఇప్పటికీ మీరు ఏ బ్యాటర్‌కు బౌలింగ్ చేయడానికి ఇష్టపడతారు?'' అని డేల్ స్టెయిన్‌ను అడిగాడు.
దీనికి స్టెయిన్ స్పందిస్తూ పాకిస్థాన్‌కు చెందిన మాజీ బ్యాటర్ మహ్మద్ హఫీజ్ పేరును ప్రస్తావించాడు.
''పాక్‌కు చెందిన మాజీ బ్యాటర్ మహ్మద్ హఫీజ్‌కు బౌలింగ్ చేసేందుకు ఆసక్తి చూపిస్తా. నేను అతడిని 16 సార్లు ఔట్ చేశా. అందుకే అతడి పేరును చెబుతా. ఎందుకంటే ఎక్కువ సార్లు అతడినే పెవిలియన్‌కు చేర్చానని డేల్ స్టెయిన్ వెల్లడించాడు.
వివరాలు
వైభవ్ భిన్నమైన ప్లేయర్..
ఇదే సందర్భంగా భారత యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ (Vaibhav Sooryavanshi)పై కూడా డేల్ స్టెయిన్ ప్రశంసలు కురిపించాడు.
వైభవ్ ప్రత్యేకమైన ఆటగాడని, ప్రస్తుతం ఉన్న చాలా మంది అంతర్జాతీయ ఆటగాళ్ల కంటే అతడు గొప్పవాడని పేర్కొన్నాడు.
అతడిని బాల మేధావిగా అభివర్ణిస్తూ.. భారత క్రికెట్‌కు అద్భుతమైన నిధిలాంటి ఆటగాడని చెప్పాడు.
'వైభవ్ సూర్యవంశీ ప్రత్యేకమైన ఆటగాడు. ప్రస్తుతం ఉన్న చాలా మంది అంతర్జాతీయ ఆటగాళ్ల కంటే గొప్పవాడే. బాల మేధావి. భారత క్రికెట్‌కు అద్భుతమైన నిధిలాంటోడు. సచిన్, విరాట్ వంటి క్రికెటర్లను చూశాం. వారి కంటే వైభవ్ ఇంకా విధ్వంసకరం. కెరీర్‌ను ఇలాగే చక్కగా కొనసాగిస్తే ఆ ఇద్దరిని అధిగమించి పెద్ద స్టార్ అవుతాడని స్టెయిన్ విశ్లేషించాడు.
వివరాలు
మంచిగా చూసుకుంటే గొప్ప ప్రతిఫలం లభిస్తుంది
అయితే వైభవ్ కెరీర్‌ను సరిగ్గా నిర్వహించడంపైనే తనకు ఆందోళన ఉందని స్టెయిన్ పేర్కొన్నాడు. యువ ఆటగాడిని మేనేజ్‌మెంట్ ఎలా చూసుకుంటుందనేది కీలకమని చెప్పాడు.
అతడిని మంచిగా చూసుకుంటే భవిష్యత్తులో గొప్ప ప్రతిఫలం అందిస్తాడని, సరిగా చూసుకోకపోతే కొన్ని సందర్భాల్లో ఇబ్బందులు తప్పవని హెచ్చరించాడు.
'ఇక్కడ ఒకటే నాకు ఆందోళన కలిగించే అంశం. అతడిని ఎలా మేనేజ్ చేస్తారో చూడాలి. మంచిగా చూసుకుంటే గొప్ప ప్రతిఫలం అందిస్తాడు.
మీరు (మేనేజ్‌మెంట్) అతడిని సరిగా చూసుకోకపోతే కొన్ని సందర్భాల్లో ఇబ్బందులు తప్పవు'' అని డేల్ స్టెయిన్ పేర్కొన్నాడు.