Loading...
Shubman Gill: సెలక్టర్ల నిర్ణయాన్ని గౌరవిస్తా.. భారత్‌ విజయమే లక్ష్యం : శుభ్‌మన్‌ గిల్
సెలక్టర్ల నిర్ణయాన్ని గౌరవిస్తా.. భారత్‌ విజయమే లక్ష్యం : శుభ్‌మన్‌ గిల్

Shubman Gill: సెలక్టర్ల నిర్ణయాన్ని గౌరవిస్తా.. భారత్‌ విజయమే లక్ష్యం : శుభ్‌మన్‌ గిల్

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 10, 2026
04:17 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారత్‌, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వనున్న ఐసీసీ పురుషుల టీ20 వరల్డ్‌ కప్‌-2026 ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు జరగనుంది. ఈ నేపథ్యంలో భారత జట్టులో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. పొట్టి ఫార్మాట్‌లో వరుసగా విఫలమవుతున్న శుభ్‌మన్‌ గిల్‌ టీ20 జట్టులో తన స్థానంతో పాటు వైస్‌ కెప్టెన్సీని కూడా కోల్పోయాడు. అతడి స్థానంలో అక్షర్‌ పటేల్‌ను తిరిగి టీ20 జట్టు వైస్‌ కెప్టెన్‌గా నియమించారు. సూర్యకుమార్‌ యాదవ్‌ మాత్రం టీ20 కెప్టెన్‌గా కొనసాగుతున్నాడు. టీ20 జట్టులో చోటు దక్కకపోవడంపై శుభ్‌మన్‌ గిల్‌ తొలిసారిగా స్పందించాడు. సెలక్టర్ల నిర్ణయాన్ని గౌరవిస్తానని స్పష్టం చేశాడు.

Details

ఆల్‌టైమ్‌ గ్రేటెస్ట్‌ ఓపెనర్‌ రోహిత్‌ శర్మ

'నేను సెలక్టర్ల నిర్ణయాన్ని పూర్తిగా గౌరవిస్తాను. టీ20 వరల్డ్‌ కప్‌ నేపథ్యంలో టీమ్‌ ఇండియాకు ఆల్‌ ది బెస్ట్‌. నేను ఉండాల్సిన చోటే ఉన్నాను.

నా విధిలో ఉన్నదాన్ని ఎవరూ తీసుకోలేరు. దేశం కోసం తన శాయశక్తులా ప్రయత్నించాలని ప్రతి ఆటగాడు కోరుకుంటాడు. సెలక్టర్లు తమ నిర్ణయాన్ని వారు తీసుకున్నారని గిల్‌ వ్యాఖ్యానించాడు.

ఈ సందర్భంగా సీనియర్‌ బ్యాటర్లు రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీపై కూడా గిల్‌ ప్రశంసలు కురిపించాడు.

'ఆల్‌టైమ్‌ గ్రేటెస్ట్‌ ఓపెనర్‌ రోహిత్‌ శర్మ, గ్రేటెస్ట్‌ వన్డే బ్యాటర్‌ విరాట్‌ భాయ్‌ జట్టులో ఉంటే కెప్టెన్‌కు పని మరింత సులభమవుతుంది. కఠిన పరిస్థితుల్లో వీరిద్దరి సలహాలు, సూచనలు ఎంతో ఉపయోగపడతాయని తెలిపాడు.

ADVERTISEMENT