LOADING...
Rinku Singh: నాన్నా.. మీ కల కోసం మైదానంలోకి దిగాను రింకూ సింగ్
నాన్నా.. మీ కల కోసం మైదానంలోకి దిగాను రింకూ సింగ్

Rinku Singh: నాన్నా.. మీ కల కోసం మైదానంలోకి దిగాను రింకూ సింగ్

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 11, 2026
12:01 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఐసీసీ మెన్స్ 2026 ఫైనల్‌కు కొన్ని రోజుల ముందు టీమిండియా స్టార్ క్రికెటర్ రింకూ సింగ్‌ వ్యక్తిగత జీవితంలో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తండ్రి లివర్ క్యాన్సర్‌తో పోరాడుతూ కన్నుమూశారు. ఈ దుర్ఘటన రింకు కుటుంబాన్ని తీవ్రంగా కలచివేసింది. పుట్టెడు దుఃఖంలో ఉన్నప్పటికీ రింకు సింగ్ తండ్రి అంత్యక్రియలు పూర్తి చేసి తిరిగి జట్టుతో చేరాడు. జట్టుకు అవసరం వచ్చిన ప్రతిసారి మైదానంలో ఫీల్డింగ్‌కు దిగుతూ తన బాధ్యతను నిర్వర్తించాడు. అనంతరం అహ్మదాబాద్‌లో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియా, న్యూజిలాండ్ పై విజయం సాధించి టీ20 వరల్డ్‌కప్ ట్రోఫీని కైవసం చేసుకుంది. ఈ విజయానంతరం రింకు సింగ్ సోషల్ మీడియాలో ఒక భావోద్వేగపూరిత పోస్ట్ షేర్ చేశాడు.

Details

మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నా

"నాన్న.. మీతో మాట్లాడకుండా ఒక్కరోజు కూడా గడిచేది కాదు. ఇప్పుడు మీరు లేకుండా నా జీవితం ఎలా ఉంటుందో నాకు తెలియడం లేదు. నా ప్రతి అడుగులోనూ మీరు తోడుగా ఉండాలి. విధి నిర్వహణ ముందే అని మీరు ఎప్పుడూ చెప్పేవారు. మీ కలను నిజం చేయడానికే నేను మైదానంలోకి దిగాను. మీ కల నెరవేరింది. కానీ మీరు ఇప్పుడు నాతోపాటు ఉంటే బాగుండేది. చిన్నదైనా, పెద్దదైనా ప్రతి ఆనందంలో మీ లేని లోటు స్పష్టంగా తెలుస్తోంది. నేను మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నాను. మిస్ యూ నాన్నా అని రింకు తన పోస్ట్‌లో పేర్కొన్నాడు.

Advertisement