
Harshal Patel: ధోనీకి ఆ బాల్ వేయకూడదని ముందే అనుకున్నా : హర్షల్ పటేల్
ఈ వార్తాకథనం ఏంటి
ఎంఎస్ ధోని చివరి ఓవర్లలో ఎంతటి ప్రమాదకరమైన బ్యాట్స్‌మన్ అన్న విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గత సీజన్లతో పాటు ఈ సీజన్‌లో కూడా ఆయన సిక్స్‌లు ప్రత్యక్షంగా చూసినవాళ్లే.
అలాంటి ధోనీ దాదాపు ఆరు ఓవర్ల ముందే క్రీజులోకి వస్తే ప్రత్యర్థి జట్టుపై ఒత్తిడి పెరగడం సహజమే. కానీ సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మాత్రం పరిస్థితి భిన్నంగా కనిపించింది.
ఈసారి ధోనీ 10 బంతులు ఆడి కేవలం 6 పరుగులకే పరిమితమయ్యాడు. ఎస్‌ఆర్‌హెచ్ బౌలర్ హర్షల్ పటేల్ ధోనీ ఆటను అడ్డుకోవడంలో కీలకపాత్ర పోషించాడు.
ధోనీ వికెట్‌తోపాటు మొత్తం నాలుగు వికెట్లు తీసి 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్'గా నిలిచాడు.
Details
వికెట్లకు దూరంగా బంతులు వేయలేదు
దీనిపై హర్షల్ పటేల్ స్పందించారు. ఓటముల తర్వాత విజయం పొందడం చాలా సంతృప్తికరం. గత మూడు మ్యాచుల్లో గెలవాలనే లక్ష్యంతో మేము కష్టపడ్డాం.
ప్రతి మ్యాచ్‌లో ఏదో ఒక అంశం లోపించింది. కానీ ఈ మ్యాచ్‌లో బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ అన్నింటిలోనూ సమతుల్యంగా రాణించగలిగాం.
బ్యాటర్ ఎదుర్కొనడానికి కష్టమైన లెంగ్త్ బంతులు వేయాలనే వ్యూహం అమలు చేశానన్నారు.
బ్యాటర్లు ఎక్కువగా మిడ్ వికెట్, స్క్వేర్ లెగ్ వైపు షాట్లు ప్రయత్నించేలా చేసి, అదే సమయంలో పేస్‌ను కూడా మిక్స్ చేశానని చెప్పారు.
ధోనీ క్రీజులో ఉన్నప్పుడు ఒత్తిడి ఉండడం సహజం. వికెట్లకు దూరంగా బంతులు వేయకూడదని, అలా చేస్తే ధోనీ కొడతాడని ముందే తెలుసని హర్షల్ వివరించాడు.
Details
ధోనీ స్పందన
మా బ్యాటింగ్‌లో వికెట్లు త్వరగా కోల్పోయినందున పెద్ద స్కోరు చేయలేకపోయాం. 155 పరుగులు బాగున్నా, అత్యుత్తమ స్కోరు కాదు. పిచ్‌పై టర్న్ పెద్దగా లేకపోయినా, మొదటి ఇన్నింగ్స్‌లో ఎనిమిదో ఓవర్ల తర్వాత పిచ్ బౌన్సర్లకు అనుకూలంగా మారింది.
అదే ఓటమికి కారణం కాదు. ఇంకొన్ని పరుగులు చేస్తే ఫలితం వేరుగా ఉండేదని నమ్ముతున్నా. డేవాల్డ్ బ్రెవిస్ అద్భుతంగా ఆడాడు. మా స్పిన్నర్లు కూడా మంచి లెంగ్త్‌లోనే బంతులు వేశారు.
కానీ పిచ్ సహకరించకపోవడంతో ఆశించిన ఫలితం రాలేదు. కనీసం 180-200 పరుగుల టార్గెట్ ఉంటే గెలిచే అవకాశం ఉండేది.
టాప్ ఆర్డర్ బ్యాటర్లు మరింత ఆత్మవిశ్వాసంతో ఆడాలి. రాబోయే మ్యాచ్‌ల్లో మా ఆటతీరు మెరుగవుతుందనే ఆశతో ఉన్నామని ధోనీ చెప్పాడు.