Loading...
Suryakumar Yadav: 'జట్టులో నా పేరు లేకపోయినా ఇలాగే నవ్వుతా'.. సూర్యకుమార్‌ ఆసక్తికర వ్యాఖ్యలు!
'జట్టులో నా పేరు లేకపోయినా ఇలాగే నవ్వుతా'.. సూర్యకుమార్‌ ఆసక్తికర వ్యాఖ్యలు!

Suryakumar Yadav: 'జట్టులో నా పేరు లేకపోయినా ఇలాగే నవ్వుతా'.. సూర్యకుమార్‌ ఆసక్తికర వ్యాఖ్యలు!

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 24, 2026
05:13 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారత టీ20 కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ మైదానంలో ఎంత కూల్‌గా ఉంటాడో.. బయట కూడా అంతే సరదాగా, ఆత్మవిశ్వాసంతో మాట్లాడుతుంటాడు. తాజాగా ప్రముఖ క్రికెట్‌ విశ్లేషకుడు ఆకాష్‌ చోప్రా నిర్వహిస్తున్న 'బైఠ్‌ & బోల్‌' టాక్‌ షో తొలి ఎపిసోడ్‌లో పాల్గొన్న సూర్య.. తన కెరీర్‌, కెప్టెన్సీ ప్రయాణానికి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను వెల్లడించాడు. ఈ సందర్భంగా ఆకాష్‌ చోప్రా ఓ ఆసక్తికరమైన ప్రశ్న అడిగాడు. ''తదుపరి మ్యాచ్‌కు భారత జట్టును ఎంపిక చేసినప్పుడు అందులో మీ పేరు లేకపోతే ఎలా స్పందిస్తారు?'' అని ప్రశ్నించాడు. దీనికి సూర్య ఎంతో ప్రశాంతంగా సమాధానమిచ్చాడు. గతంలో జట్టులో తన పేరు లేనప్పుడు కూడా తాను ఇలాగే నవ్వానని చెప్పాడు.

వివరాలు

అహ్మదాబాద్‌ సెంటిమెంట్‌ను మార్చాలనుకున్నాం

జట్టు భవిష్యత్తు కోసం సెలక్టర్లు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా దానిని గౌరవిస్తానని, ఎలాంటి పరిస్థితినైనా స్వీకరించేందుకు సిద్ధంగా ఉంటానని స్పష్టం చేశాడు.

తన కెప్టెన్సీలో వచ్చిన టీ20 ప్రపంచకప్‌ గురించి కూడా సూర్య ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.

2023 వన్డే ప్రపంచకప్‌ ఫైనల్‌లో ఓటమి తర్వాత అహ్మదాబాద్‌ స్టేడియం గురించి ప్రతికూల సెంటిమెంట్‌ ఏర్పడిందని గుర్తుచేసుకున్నాడు.

అయితే ఈసారి ఎలాగైనా ఆ సెంటిమెంట్‌ను తిరగరాయాలని గట్టిగా నిర్ణయించుకున్నట్లు తెలిపాడు.

అహ్మదాబాద్‌లో దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో విజయం సాధించిన తర్వాతే.. 'మనం ప్రత్యేకంగా ఏదో సాధించబోతున్నాం' అనే బలమైన నమ్మకం జట్టులో ఏర్పడిందని సూర్య చెప్పాడు.

వివరాలు

సంజూ శాంసన్‌ ఎంపికే కష్టమైన నిర్ణయం

జట్టు ఎంపికలో అత్యంత కఠినమైన నిర్ణయం ఏదని ప్రశ్నించగా సూర్యకుమార్‌ యాదవ్‌ సంజూ శాంసన్‌ పేరును ప్రస్తావించాడు.

జట్టు కలయిక కారణంగా ప్రతిభావంతుడైన ఆటగాడిని ప్లేయింగ్‌ ఎలెవన్‌లోకి తీసుకోలేకపోవడం ఎంతో బాధాకరమని అంగీకరించాడు.

అయితే టోర్నీ మధ్యలో జట్టులోకి వచ్చిన సంజూ శాంసన్‌.. తుది మ్యాచ్‌ వరకు అద్భుతంగా రాణించి 'ప్లేయర్‌ ఆఫ్‌ ది టోర్నమెంట్‌'గా నిలవడం తనను ఎంతగానో ఆకట్టుకుందని సూర్య తెలిపాడు.

ఆ ప్రదర్శన తర్వాత సంజూపై తనకున్న గౌరవం మరింత పెరిగిందని ప్రశంసించాడు.

ADVERTISEMENT

వివరాలు

పాక్‌తో మ్యాచ్‌లో హార్దిక్‌ వికెట్‌తో టెన్షన్

పాకిస్థాన్‌తో మ్యాచ్‌ అంటే సహజంగానే ఒత్తిడి ఉంటుందని సూర్య చెప్పాడు. అయితే మ్యాచ్‌ ప్రారంభమైనప్పుడు తనకు ఎలాంటి టెన్షన్‌ అనిపించలేదని తెలిపాడు.

కానీ 13వ ఓవర్‌లో హార్దిక్‌ పాండ్యా వికెట్‌ పడిపోవడంతో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయిందని గుర్తుచేసుకున్నాడు.

ఆ సమయంలో తీవ్ర ఒత్తిడికి గురై ఒళ్లంతా చెమటలు పట్టాయని సరదాగా చెప్పాడు.

ADVERTISEMENT

వివరాలు

బుమ్రా బంతులు 'అపరంజి బంగారం'

టీమ్‌ ఇండియా స్టార్‌ పేసర్‌ జస్ప్రీత్‌ బుమ్రాపై కూడా సూర్యకుమార్‌ యాదవ్‌ ప్రశంసలు కురిపించాడు. బుమ్రా వేసే 24 బంతులు 'అపరంజి బంగారం' వంటివని, వాటిని ఎంతో జాగ్రత్తగా, సరైన సమయంలో ఉపయోగించుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నాడు.

మ్యాచ్‌ కష్టాల్లో ఉన్నప్పుడు బుమ్రా స్వయంగా ముందుకొచ్చి.. ''నేను చూసుకుంటాను.. మీ పని నేను పూర్తి చేస్తాను'' అంటూ కెప్టెన్‌కు భరోసా ఇవ్వడం అద్భుతంగా ఉంటుందని సూర్య కొనియాడాడు.

కీలక సమయాల్లో బుమ్రా చూపించే ఆత్మవిశ్వాసం, బాధ్యత తీసుకునే తీరు జట్టుకు ఎంతో బలాన్నిస్తాయని చెప్పాడు.

ADVERTISEMENT