
WTC - ICC: టెస్టు క్రికెట్‌ను మరింత ప్రోత్సాహించేందుకు ఐసీసీ కీలక నిర్ణయం.. డబ్ల్యూటీసీ ప్రైజ్‌మనీని భారీగా పెంపు
ఈ వార్తాకథనం ఏంటి
టెస్టు క్రికెట్‌ను మరింత ఉత్సాహంగా కొనసాగించేందుకు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ఒక కీలక నిర్ణయం తీసుకుంది.
ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ (WTC) ప్రైజ్‌మనీని గణనీయంగా పెంచుతూ 2023-25 సీజన్‌కు సంబంధించిన బహుమతిని రూ.49.27 కోట్లుగా నిర్ణయించింది.
ఈ మొత్తం 5.76 మిలియన్ అమెరికన్ డాలర్లకు సమానం.ఈ డబ్ల్యూటీసీలో పాల్గొన్న తొమ్మిది జట్ల మధ్య ఈ మొత్తాన్ని విభజించనున్నారు.
గత రెండు టెస్టు ఛాంపియన్‌షిప్ ఎడిషన్లతో పోలిస్తే ఇది భారీ పెంపు. అప్పట్లో ఇచ్చిన ప్రైజ్‌మనీ కేవలం 3.8 మిలియన్ డాలర్లు మాత్రమే.
తాజా ఎడిషన్ ఫైనల్‌లో ఆసీస్ (ఆస్ట్రేలియా),దక్షిణాఫ్రికా జట్లు తలపడనున్నాయి.
ఈ మ్యాచ్ జూన్ 11న లండన్‌లోని ప్రఖ్యాత లార్డ్స్ మైదానంలో ప్రారంభం కానుంది.
వివరాలు
భారత జట్టుకు రూ.12.31 కోట్లు
ఇందులో విజేతగా నిలిచిన జట్టుకు రూ.30.78 కోట్లు లభించనుండగా, రెండో స్థానాన్ని దక్కించుకునే జట్టుకు రూ.18.46 కోట్లు ప్రదానం చేయనున్నట్లు ఐసీసీ ప్రకటించింది.
పాయింట్ల పట్టిక ఆధారంగా మూడో స్థానాన్ని సంపాదించిన భారత జట్టుకు రూ.12.31 కోట్లు లభించనున్నాయి.
అలాగే, నాలుగో స్థానంలో ఉన్న న్యూజిలాండ్ జట్టుకు రూ.10.26 కోట్లు,ఐదో స్థానంలో నిలిచిన ఇంగ్లాండ్ జట్టుకు రూ.8.2 కోట్లు లభించనున్నాయి.
ఆ తర్వాతి స్థానాల్లో ఉన్న జట్లకు వరుసగా.. శ్రీలంకకు రూ.7.18 కోట్లు,బంగ్లాదేశ్‌కు రూ.6.15 కోట్లు, వెస్టిండీస్‌కు రూ.5.13 కోట్లు,పాకిస్థాన్‌కు రూ.4.10 కోట్లు అందించనున్నారు.
వివరాలు
ఇంగ్లాండ్ తో ఐదు టెస్టుల సిరీస్
ఇకపోతే ఐపీఎల్ 2025 సీజన్ జూన్ 3న ముగియనుంది. అనంతరం భారత జట్టు ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లనుంది, అక్కడ ఐదు టెస్టుల సిరీస్‌ను ఆడనుంది.
ఈ సిరీస్‌తోనే 2025-2027 వరకూ కొనసాగే తదుపరి డబ్ల్యూటీసీ ప్రారంభమవుతుంది. ఈ టెస్టు సిరీస్ కోసం భారత జట్టును త్వరలోనే ప్రకటించే అవకాశముందని సమాచారం.