Arshdeep Singh: టీ20 ఫైనల్ ఘటన.. అర్ష్‌దీప్ సింగ్‌పై ఐసీసీ జరిమానా
ఈ వార్తాకథనం ఏంటి
టీ20 ప్రపంచకప్ ఫైనల్‌లో జరిగిన ఘటనకు సంబంధించి భారత పేసర్ అర్ష్దీప్ సింగ్ పై ఐసీసీ జరిమానా విధించింది. న్యూజిలాండ్ బ్యాటర్ డారెల్ మిచెల్ పై అనుచితంగా బంతి విసిరినందుకు అర్ష్‌దీప్ మ్యాచ్ ఫీజులో 15 శాతం కోత విధిస్తున్నట్లు ఐసీసీ ప్రకటించింది. ఐసీసీ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు జరిమానాతో పాటు అతనికి ఒక డీమెరిట్ పాయింట్ కూడా నమోదు చేసింది.
Details
ఘటన ఏమిటి?
ఫైనల్ మ్యాచ్‌లో న్యూజిలాండ్ ఇన్నింగ్స్ సందర్భంగా 11వ ఓవర్‌ను అర్ష్‌దీప్ సింగ్ వేశాడు. ఆ ఓవర్‌లో డారిల్ మిచెల్ వరుసగా రెండు సిక్సర్లు బాదడంతో అర్ష్‌దీప్ కాస్త అసహనం వ్యక్తం చేశాడు. తర్వాతి బంతిని మిచెల్ తనవైపు ఆడగా, అర్ష్‌దీప్ బంతిని నేరుగా అతడి వైపే విసిరాడు. ఈ చర్యతో అసహనం చెందిన మిచెల్ "ఇది ఏమిటి?" అన్నట్లుగా ప్రశ్నిస్తూ అసంతృప్తి వ్యక్తం చేశాడు. అయితే అర్ష్‌దీప్ మాత్రం వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోయాడు.
Details
కావాలని బంతిని అతని వైపు విసరలేదు
పరిస్థితిని చల్లార్చేందుకు భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మిచెల్ వద్దకు వెళ్లి మాట్లాడి వివరణ ఇచ్చాడు. ఇదిలా ఉండగా అంపైర్లు కూడా అర్ష్‌దీప్‌తో మాట్లాడి అతనికి సూచనలు ఇచ్చారు. దాంతో అర్ష్‌దీప్ మిచెల్‌కు 'సారీ' అన్నట్లుగా సంకేతాలు ఇచ్చాడు. మ్యాచ్ ముగిసిన తర్వాత ఇద్దరు ఆటగాళ్లు మళ్లీ మాట్లాడుకుంటూ కనిపించారు. తాను మిచెల్‌కు క్షమాపణ చెప్పానని, కావాలని బంతిని అతని వైపు విసరలేదని అర్ష్‌దీప్ తర్వాత స్పష్టం చేశాడు. అయినప్పటికీ ఐసీసీ ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనగా భావించి అతనిపై జరిమానా విధించింది.