
Mohsin Naqvi - Haris Rauf: హారిస్ రవూఫ్‌కి ఐసీసీ జరిమానా.. చెల్లించేది పీసీబీ చైర్మన్ నఖ్వీయే!
ఈ వార్తాకథనం ఏంటి
పాకిస్థాన్ క్రికెట్ లోపాలను దాచిపెట్టడంలో పెద్దలు, ఆటగాళ్లు ఎప్పటిలాగే వెనకాడరని మరోసారి బయటపడింది. ఆసియా కప్ 2025లో భారత్‌తో మ్యాచ్ సందర్భంగా పాక్ పేసర్ హారిస్ రవూఫ్ రెచ్చగొట్టే హావభావాలు ప్రదర్శించడంతో విమర్శలు వెల్లువెత్తాయి. ఈ ఘటనపై బీసీసీఐ నేరుగా ఐసీసీకి ఫిర్యాదు చేసింది. విచారణ అనంతరం ఐసీసీ హారిస్‌కు మ్యాచ్ ఫీజులో 30శాతం జరిమానా విధించింది. అయితే ఈ జరిమానాను పాకిస్థాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ మోసిన్ నఖ్వీ వ్యక్తిగతంగా చెల్లించనున్నారని సమాచారం. నఖ్వీ పాక్ ప్రభుత్వంలో మంత్రి కావడంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారని క్రికెట్ వర్గాలు చెబుతున్నాయి. ఉగ్రవాదానికి మద్దతు ఇస్తున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న పాక్.. ఇప్పుడు హారిస్ రవూఫ్ వివాదాస్పద ప్రవర్తనకు కూడా బలంగా నిలబడినట్లు అయింది.
Details
కేవలం హెచ్చరికే ఇచ్చిన ఐసీసీ
హారిస్‌తో పాటు పాక్ ఓపెనర్ సాహిబ్‌జాదా ఫర్హాన్‌పై కూడా బీసీసీఐ ఫిర్యాదు చేసింది. మరోవైపు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌పై పీసీబీ కంప్లైంట్ చేసిన సంగతి గమనార్హం. ఈ క్రమంలో సూర్య, రవూఫ్‌లకు 30 శాతం జరిమానా విధించగా.. ఫర్హాన్‌కు మాత్రం హెచ్చరికతోనే వదిలేశారు. హాఫ్ సెంచరీ తర్వాత గన్ పేల్చినట్లు ప్రవర్తించినా సరే, అతడిని ఐసీసీ కేవలం వార్నింగ్‌తో వదిలేయడం బీసీసీఐలో అసంతృప్తిని రేపింది.
Details
అప్పీల్ దిశగా బీసీసీఐ
ఆసియా కప్ గ్రూప్ మ్యాచ్‌లో పాక్‌ను ఓడించిన తర్వాత 'ఈ విజయాన్ని పహల్గాం ఉగ్రదాడి బాధితులకు, భారత సైనికులకు అంకితం చేస్తున్నానని సూర్య ప్రకటించాడు. దానిని రాజకీయ వ్యాఖ్యగా పరిగణించిన పీసీబీ ఫిర్యాదు చేయగా, ఐసీసీ సూర్యపై కూడా 30 శాతం జరిమానా విధించింది. దీనిపై బీసీసీఐ అప్పీల్‌కు వెళ్ళేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం.