
IND vs WI : టీమిండియా ప్లేయర్‌పై విండీస్ ఆటగాడు దురుసు ప్రవర్తన.. క్షమాపణ చెప్పినా వదలని ఐసీసీ!
ఈ వార్తాకథనం ఏంటి
ఇండియా వర్సెస్ వెస్టిండీస్ జట్ల మధ్య ఢిల్లీలో రెండో టెస్టు జరుగుతోంది. భారత్ తొలి ఇన్నింగ్స్ 5 వికెట్లకు 518 డిక్లేర్డ్ చేసింది. వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్ 248 పరుగులకే ఆలౌట్ అయ్యి, ఫాలో-ఆన్ ఆడాల్సి వచ్చింది. మూడో రోజు ముగిసే సమయానికి, వెస్టిండీస్ 2 వికెట్లు కోల్పోయి 173 పరుగులు చేసింది, ఇంకా 97 పరుగులు వెనుక ఉంది.
Details
సీల్స్ దురుసుగా బంతి విసిరిన ఘటన
మ్యాచ్ ప్రారంభ రోజున విండీస్ ఫాస్ట్ బౌలర్ జేడన్ సీల్స్, భారత ఓపెనర్ యశస్వీ జైస్వాల్ పట్ల దురుసుగా ప్రవర్తించాడు. జైస్వాల్ 29వ ఓవర్లో క్రీజులో ఉన్నప్పుడు, ఫ్రస్టేషన్లో సీల్స్ ఓవరాక్షన్ చేశాడు. ఫ్రస్టేషన్‌లో, సీల్స్ జైస్వాల్ వైపు ప్రమాదకరంగా బంతి విసిరాడు, ఇది జైస్వాల్ ప్యాడ్స్‌పై బలంగా తాకింది. ఐసీసీ చర్యలు ఐసీసీ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఆర్టికల్ 2.9 ప్రకారం, ఆటగాడు బంతిని లేదా ఇతర క్రికెట్ సామాగ్రిని ఇతర ఆటగాళ్లపైకి లేదా వారి సమీపంలోకి విసరకూడదు. సీల్స్ చేసిన పని ఈ నిబంధనల ఉల్లంఘనగా గుర్తించారు. ఐసీసీ సీల్స్‌కు ఒక డీమెరిట్ పాయింట్, మ్యాచ్ ఫీజులో 25 శాతం కోత విధించింది.
Details
సీల్స్ వాదన
సీల్స్ రిఫరీ పైక్రాఫ్ట్‌కు వివరించాడు. కావాలని నేను బంతిని జైస్వాల్ వైపు వేయలేదు, రన్‌ఔట్ చేయాలని మాత్రమే బంతి విసిరాను. ఐసీసీ ఈ విషయాన్ని పలుసార్లు వీడియోలో పరిశీలించింది. చివరిగా జైస్వాల్ క్రీజులో ఉన్నప్పటికీ రన్‌ఔట్ చేసే అవకాశం లేకపోయినా సీల్స్ కావాలనే బంతిని జైస్వాల్ వైపు విసిరాడని నిర్ధారించింది. దీంతో ఒక డీమెరిట్ పాయింట్, మ్యాచ్ ఫీజులో 25 శాతం కోత అతనికి విధించారు.