Page Loader
ICC Hall of Fame: భారత మహిళా క్రికెటర్‌కు ఐసీసీ ప్రతిష్ఠాత్మక గౌరవం
భారత మహిళా క్రికెటర్‌కు ఐసీసీ ప్రతిష్ఠాత్మక గౌరవం

ICC Hall of Fame: భారత మహిళా క్రికెటర్‌కు ఐసీసీ ప్రతిష్ఠాత్మక గౌరవం

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 16, 2024
05:08 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారత మాజీ మహిళా క్రికెటర్ నీతూ డేవిడ్‌కి ప్రతిష్ఠాత్మక గౌరవం దక్కింది. నీతూ డేవిడ్‌ను ఐసీసీ హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌లో చేర్చింది. ఆమెతో పాటు ఇంగ్లాండ్ దిగ్గజ ఆటగాడు అలిస్టర్ కుక్, సౌతాఫ్రికా స్టార్‌ ఏబీ డివిలియర్స్‌ కూడా ఈ గౌరవాన్ని పొందడం విశేషం. ఈ ముగ్గురు ఆటగాళ్లను ఐసీసీ బుధవారం హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌ జాబితాలో చేర్చినట్లు ప్రకటించింది. గతేడాది వీరేంద్ర సెహ్వాగ్‌, డయానా ఎడుల్జీ, శ్రీలంక దిగ్గజ ఆటగాడు అరవింద డిసిల్వా ఈ జాబితాలో చేరిన విషయం తెలిసిందే. ఉత్తరప్రదేశ్‌కి చెందిన ఎడమ చేతివాటం స్పిన్నర్‌ నీతూ డేవిడ్‌ 1995-2008 మధ్య కాలంలో భారత్ తరఫున క్రికెట్‌ ఆడింది.

Details

సెలక్షన్ కమిటీ ఛైర్ పర్సన్ గా నీతూ డేవిడ్

ఆమె 97 వన్డేల్లో 141 వికెట్లు తీసి, 16.34 యావరేజ్‌ కలిగి ఉంది. 10 టెస్టుల్లో 41 వికెట్లు పడగొట్టి, 18.90 యావరేజ్‌ను అందుకుంది. భారత్ తరఫున వన్డేల్లో 100 వికెట్లు తీసిన తొలి మహిళా క్రికెటర్‌గా గుర్తింపు పొందిన నీతూ, 1995లో ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్టులో ఒక ఇన్నింగ్స్‌లో 8/53 తీసి రికార్డు సృష్టించింది. ఇది మహిళల టెస్టు క్రికెట్‌లో అత్యుత్తమ బౌలింగ్ ఫిగర్‌గా నిలిచింది. ప్రస్తుతం నీతూ డేవిడ్‌ మహిళల క్రికెట్‌ జట్టు సెలక్షన్ కమిటీ ఛైర్‌పర్సన్‌గా ఉన్నారు.