Loading...
ICC: పాక్ స్టార్‌కు ఐసీసీ షాక్‌.. డోపింగ్ ఉల్లంఘనతో మూడు నెలల నిషేధం!
పాక్ స్టార్‌కు ఐసీసీ షాక్‌.. డోపింగ్ ఉల్లంఘనతో మూడు నెలల నిషేధం!

ICC: పాక్ స్టార్‌కు ఐసీసీ షాక్‌.. డోపింగ్ ఉల్లంఘనతో మూడు నెలల నిషేధం!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 17, 2026
04:41 pm

ఈ వార్తాకథనం ఏంటి

పాకిస్థాన్‌కు చెందిన ఎడమచేతి స్పిన్నర్ మహ్మద్ నవాజ్ (Mohammad Nawaz) ఐసీసీ (ICC) యాంటీ డోపింగ్ నిబంధనలను ఉల్లంఘించినందుకు మూడు నెలల సస్పెన్షన్‌కు గురయ్యాడు. అయితే అతను డ్రగ్‌ అబ్యూజ్‌ ట్రీట్‌మెంట్‌ ప్రోగ్రామ్‌ను విజయవంతంగా పూర్తి చేస్తే ఈ నిషేధాన్ని ఒక నెలకు తగ్గించే అవకాశం ఉంటుందని ఐసీసీ అధికారిక ప్రకటనలో వెల్లడించింది. ఈ ఏడాది ఫిబ్రవరి 7న శ్రీలంకలోని కొలంబో వేదికగా జరిగిన ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్‌లో నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్ అనంతరం నవాజ్‌కు డోపింగ్ పరీక్షలు నిర్వహించారు. ఆ పరీక్షల్లో నిషేధిత పదార్థమైన కార్బాక్సీ-టిహెచ్‌సి (Carboxy-THC) వినియోగించినట్లు తేలడంతో అతను డోపింగ్ నిబంధనలను ఉల్లంఘించినట్లు నిర్ధారణ అయింది.

వివరాలు

పోటీలో లేనప్పుడే మాత్రమే తీసుకున్నాను

ఈ వ్యవహారంపై స్పందించిన మహ్మద్ నవాజ్ తన తప్పును అంగీకరించాడు. అయితే ఆ నిషేధిత పదార్థాన్ని తాను పోటీలు లేని సమయంలో (Out-of-Competition) మాత్రమే తీసుకున్నానని, దానికి మ్యాచ్‌ల్లో తన ప్రదర్శనతో ఎలాంటి సంబంధం లేదని నిరూపించగలిగాడు.

తన తప్పును ఒప్పుకున్న నవాజ్ 2026 మే 1 నుంచి స్వచ్ఛందంగా తాత్కాలిక సస్పెన్షన్‌లోకి వెళ్లాడు. దీంతో అదే తేదీ నుంచి మూడు నెలల నిషేధాన్ని అమల్లోకి తీసుకున్నట్లు ఐసీసీ పరిగణించింది.

అదేవిధంగా, నిబంధనల ప్రకారం వ్యసన విముక్తి (Drug Abuse Treatment) కార్యక్రమంలో పాల్గొనేందుకు నవాజ్ అంగీకరించాడు.

ఇప్పటికే రెండున్నర నెలల సస్పెన్షన్‌ను పూర్తి చేసిన నేపథ్యంలో అతనిపై అమలులో ఉన్న తాత్కాలిక సస్పెన్షన్‌ను ఐసీసీ ఎత్తివేసింది.

వివరాలు

రికార్డులు కూడా డిస్క్వాలిఫై చేస్తున్నట్లు ప్రకటన

ఇక ఐసీసీ సంతృప్తి చెందేలా ట్రీట్‌మెంట్‌ ప్రోగ్రామ్‌ను పూర్తి చేస్తే, భవిష్యత్తులో అతనిపై ఎలాంటి అదనపు నిషేధం ఉండదని స్పష్టం చేసింది.

అయితే ఐసీసీ యాంటీ డోపింగ్ నిబంధనల ప్రకారం, ఫిబ్రవరి 7న నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌తో పాటు ఆ తర్వాత మే 1, 2026 వరకు మహ్మద్ నవాజ్ ఆడిన అన్ని మ్యాచ్‌ల ఫలితాలు, వ్యక్తిగత గణాంకాలు, రికార్డులను డిస్క్వాలిఫై చేసినట్లు ఐసీసీ వెల్లడించింది.

ADVERTISEMENT