ICC T20 WC 2026: టీ20 వరల్డ్‌కప్ ఐసీసీ టీమ్ ప్రకటన.. భారత్ నుంచి నలుగురికి స్థానం!
ఈ వార్తాకథనం ఏంటి
ఐసీసీ మెన్స్ టీ20 ప్రపంచకప్ 2026 టైటిల్‌ను భారత్ కైవసం చేసుకుని మరో చరిత్ర సృష్టించింది. కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్ నాయకత్వంలో భారత జట్టు ట్రోఫీని అందుకుంది. ఇది భారత్‌కు మూడో టీ20 ప్రపంచకప్ కావడం విశేషం. ఇక టోర్నీలో అత్యుత్తమ ప్రదర్శన చేసిన ఆటగాళ్లతో కూడిన జట్టును ఐసీసీ తాజాగా ప్రకటించింది. ఈ జట్టులో భారత్ నుంచి నలుగురు ఆటగాళ్లు చోటు దక్కించుకున్నారు.
Details
కెప్టెన్‌గా అడమ్ మార్క్రమ్ ఎంపిక
టోర్నీలో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా నిలిచిన సంజు శాంసన్, జస్పిత్ బుమ్రా, ఇషాన్ కిషన్, హర్దిక్ పాండ్యాకు జట్టులో స్థానం కల్పించింది.
అయితే విజేత జట్టుకు నాయకత్వం వహించిన సూర్యకుమార్ యాదవ్ కు మాత్రం ఈ జట్టులో చోటు దక్కకపోవడం ఆశ్చర్యానికి గురిచేసింది.
ఐసీసీ ప్రకటించిన ఈ టీమ్‌కు అడమ్ మార్క్రమ్ ను కెప్టెన్‌గా ఎంపిక చేసింది.
Details
ఐసీసీ ప్రకటించిన జట్టు
వికెట్‌కీపర్: సంజు శాంసన్ (భారత్)
సాహిబ్జాదా ఫర్హాన్ (పాకిస్థాన్)
ఇషాన్ కిషన్ (భారత్)
కెప్టెన్: ఐడెన్ మార్క్రామ్ (దక్షిణాఫ్రికా)
హార్దిక్ పాండ్య (భారత్)
విల్ జాక్స్ (ఇంగ్లాండ్)
జాసన్ హోల్డర్ (వెస్టిండీస్)
జస్ప్రీత్ బుమ్రా (భారత్)
లుంగీ లుంగిడి (దక్షిణాఫ్రికా)
ఆదిల్ రషీద్ (ఇంగ్లాండ్)
బ్లెస్సింగ్ ముజారబానీ (జింబాబ్వే)
12వ అటగాడిగా షాడ్లీ వాన్ షాల్క్‌విక్ (యూఎస్‌ఏ)