LOADING...
ICC T20 Rankings: మహిళల టీ20లో భారత్ హవా..టాప్‌లో స్మృతి మందన్న,దీప్తి!
మహిళల టీ20లో భారత్ హవా..టాప్‌లో స్మృతి మందన్న,దీప్తి!

ICC T20 Rankings: మహిళల టీ20లో భారత్ హవా..టాప్‌లో స్మృతి మందన్న,దీప్తి!

వ్రాసిన వారు Moogati Shabari
Mar 24, 2026
05:46 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఇటీవల ప్రకటించిన ఐసీసీ మహిళల టీ20 అంతర్జాతీయ ర్యాంకింగ్స్‌లో భారత మహిళా క్రికెట్ జట్టు మంచి ప్రదర్శనతో ఆకట్టుకుంది. ప్రముఖ బ్యాటర్ స్మృతి మందన్న తన రెండో స్థానంలోనే కొనసాగుతోంది. జట్టు నాయకురాలు హర్మన్‌ప్రీత్ కౌర్ మాత్రం ఒక స్థానం మెరుగుపరుచుకుని 14వ స్థానానికి చేరుకుంది. మరో ఓపెనర్ షెఫాలీ వర్మ ఆరో స్థానంలో కొనసాగుతూ టాప్-10లో తన స్థానాన్ని స్థిరంగా ఉంచుకుంది. జెమిమా రోడ్రిగ్స్ మాత్రం 11వ స్థానంతో సరిపెట్టుకుంది.

వివరాలు

బౌలింగ్‌లో కూడా అదరగొట్టారు..

బ్యాటింగ్‌లో ఈ విధంగా రాణించిన భారత జట్టు, బౌలింగ్ విభాగంలో కూడా మంచి ర్యాంకింగ్స్ సాధించింది. ఆల్‌రౌండర్ దీప్తి శర్మ ఒక స్థానం పైకి ఎగబాకి మూడో స్థానాన్ని దక్కించుకుంది. అంతేకాకుండా ఆల్‌రౌండర్ల జాబితాలో కూడా ఆమె మూడో స్థానంలోనే ఉంది. ఆమె తరువాత ఫాస్ట్ బౌలర్ రేణుకా సింగ్ ఠాకూర్ ఆరో స్థానాన్ని నిలబెట్టుకోగా, అరుంధతి రెడ్డి ఒక స్థానం వెనక్కి వెళ్లి 11వ స్థానానికి చేరింది. బ్యాటర్ల జాబితాలో ఆస్ట్రేలియా క్రీడాకారిణి బెత్ మోని 793 పాయింట్లతో అగ్రస్థానాన్ని కొనసాగిస్తోంది.

వివరాలు

మూడో స్థానంలో భారత్..

బౌలింగ్ విభాగంలో పాకిస్థాన్‌కు చెందిన సాదియా ఇక్బాల్ 743 పాయింట్లతో మొదటి స్థానంలో నిలిచింది. ఆల్‌రౌండర్ల విభాగంలో వెస్టిండీస్ ఆటగాళి హేలీ మ్యాథ్యూస్ 465 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. జట్టు ర్యాంకింగ్స్ విషయానికి వస్తే, 294 రేటింగ్ పాయింట్లతో ఆస్ట్రేలియా జట్టు మొదటి స్థానంలో ఉంది. 268 పాయింట్లతో భారత జట్టు మూడో స్థానాన్ని కొనసాగిస్తోంది.

Advertisement