Year Ender 2024: ఈ ఏడాది నింగికెగిసిన క్రీడా దిగ్గజాలు వీరే !
అసాధారణ ప్రదర్శనతో పాటు సంచలన విజయాలతో అభిమానుల మనసులను గెలుచుకున్న క్రీడాకారులు ఈ ఏడాది నేల రాలారు. ఫుట్‌బాల్, క్రికెట్, వంటి క్రీడలల్లో తమ విజయాలతో అభిమానుల మనసులను గెలుచుకున్న వారు ఎందరో. అందులో కొందరిని ఈ ఏడాది ముగుస్తున్న నేపథ్యంలో ఒకసారి స్మరించుకుందాం.! 1. ఫ్రాంజ్ బెకెన్‌బౌర్(ఫుట్‌బాల్) ఫ్రాంజ్ బెకెన్‌బౌర్,ఈ ఫుట్‌బాల్ ఆటగాడు అసాధారణ ప్రదర్శనతో పాటు అతని నాయకత్వం అతడిని ఓ ఐకాన్ ఆటగాడిగా నిలబెట్టాయి ఒక ఆటగాడిగా, కోచ్‌గా, ఆయన ఫిఫా ప్రపంచకప్ గెలిచారు. ఫుట్‌బాల్ మైదానంలో తన అనుభవం, అత్యద్భుత నాయకత్వంతో ఆయన ఐకాన్‌గా మిగిలిపోయారు. 78 ఏళ్ల వయసులో ఆయన మరణం, ఫుట్‌బాల్ ప్రపంచంలో పెద్ద విషాదంగా మారింది.
2. అన్షుమన్ గైక్వాడ్..
ఫ్రాంజ్ బెకెన్‌బౌర్ మరణాన్ని నివాళిగా, ఆయన క్లబ్ బయెర్న్ ముంచి జెర్సీ నెంబర్ 5ని రిటైర్ చేసింది. భారత క్రికెట్ లో అన్షుమన్ గైక్వాడ్ మరణం ఈ ఏడాది భారత క్రికెట్‌లో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. అతను క్యాన్సర్‌తో భయానక పోరాటం చేస్తూ 71 ఏళ్ల వయసులో చనిపోయాడు. గైక్వాడ్ 40 టెస్ట్ మ్యాచ్‌లు, 15 వన్డేలు ఆడినప్పటికీ, అతను 2000లో జరిగిన ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ రన్నర్-అప్ గా భారత జట్టుకు కోచ్‌గా సేవలందించాడు. అతడు ఆటగాడిగా,కోచ్‌గా చేసిన విభిన్న విజయాలు భారత క్రికెట్‌కు అపారమైన గౌరవాన్ని తెచ్చాయి.
3.డెరెక్ అండర్‌వుడ్-మోస్ట్ డేంజరస్ ప్లేయర్
ఇంగ్లాండ్ క్రికెట్ దిగ్గజం డెరెక్ అండర్‌వుడ్ ఈ ఏడాది మరణించాడు. మూడు దశాబ్దాల కెరీర్‌లో మొత్తం 1087 మ్యాచ్‌లు ఆడి 3037 వికెట్లు సాధించిన ఒక అద్భుతమైన బౌలర్ గా ప్రపంచాన్ని ఆకట్టుకున్నాడు. 86 టెస్టులు, 26 వన్డేలు ఆడిన అతను 297 టెస్ట్ వికెట్లు, 32 వన్డే వికెట్లు సాధించి తన పేరు రాసుకున్నాడు. 4. మారియో జాగల్లో(ఫుట్‌బాల్) బ్రెజిల్ ఫుట్‌బాల్ దిగ్గజం మారియో జాగల్లో 92 సంవత్సరాల వయసులో ఈ ఏడాది మరణించారు. ఫుట్‌బాల్ లో నాలుగు సార్లు ఫిఫా ప్రపంచకప్ గెలిచిన జాగల్లో, రెండు సార్లు ఆటగాడిగా, రెండు సార్లు కోచ్‌గా విజయం సాధించారు. అతని ఆటగాడిగా,కోచ్‌గా చేసిన సేవలు ఫుట్‌బాల్ ప్రపంచంలో ఎంతో ప్రాధాన్యం సంతరించుకున్నాయి.