Venkatesh Iyer: గిల్ సెంచరీ చేస్తే నన్నే టార్గెట్ చేస్తారు.. కేకేఆర్ ఫ్యాన్స్‌పై వెంకటేశ్ అయ్యర్ కామెంట్స్!
ఈ వార్తాకథనం ఏంటి
ఐపీఎల్‌లో ఒకప్పుడు కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) జట్టుకు ప్రాతినిధ్యం వహించిన వెంకటేశ్ అయ్యర్.. ప్రస్తుతం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టులో స్టార్ బ్యాటర్‌గా కొనసాగుతున్నాడు. తాజాగా అతడు తన క్రికెట్ కెరీర్‌లో ఎదుర్కొన్న చేదు అనుభవాల గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. ముఖ్యంగా ఐపీఎల్ 2022 సీజన్‌కు ముందు శుభ్‌మన్ గిల్‌ను వదులుకుని తనను జట్టులో కొనసాగించాలని కేకేఆర్ నిర్ణయించడంతో అభిమానుల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొన్నట్లు తెలిపాడు. సోషల్ మీడియాలో తనపై జరిగిన విమర్శలు, కేకేఆర్ నుంచి వీడ్కోలు, ఆర్సీబీలో చేరిన తర్వాత ఎదురైన అనుభవాల గురించి ఆకాష్ చోప్రా నిర్వహించిన 'బైట్ & బోల్' పాడ్‌కాస్ట్‌లో మనసు విప్పాడు.
వివరాలు
గిల్‌ను వదిలి నన్ను రిటైన్ చేసుకోవడంతో తీవ్ర విమర్శలు
ఐపీఎల్ 2022 సీజన్‌కు ముందు కేకేఆర్.. శుభ్‌మన్ గిల్‌ను వదిలేసి వెంకటేశ్ అయ్యర్‌ను రిటైన్ చేసుకుంది. ఆ తర్వాత గుజరాత్ టైటాన్స్ జట్టు గిల్‌ను రూ.8 కోట్లకు కొనుగోలు చేసింది.
అయితే కేకేఆర్ యాజమాన్యం తీసుకున్న ఈ నిర్ణయంపై అభిమానులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో వెంకటేశ్ అయ్యర్ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది.
ఈ విషయంపై అయ్యర్ మాట్లాడుతూ.. ''చాలా కాలంగా నేను అభిమానుల నుంచి ద్వేషాన్ని ఎదుర్కొంటూనే ఉన్నాను. ఇప్పటికీ శుభ్‌మన్ గిల్ సెంచరీ చేస్తే చాలు.. కేకేఆర్ సోషల్ మీడియా పేజీల్లో అభిమానులు కామెంట్లు పెడుతుంటారు.
బంగారం కోసం వజ్రాన్ని వదులుకున్నామని అంటున్నారని తన ఆవేదనను వ్యక్తం చేశాడు.
వివరాలు
షారుఖ్ ఖాన్‌ను అడిగినప్పుడు కళ్లు చెమ్మగిల్లాయి
ఐపీఎల్ 2026 వేలానికి ముందు చోటుచేసుకున్న పరిణామాలను కూడా వెంకటేశ్ అయ్యర్ గుర్తుచేసుకున్నాడు.
కేకేఆర్ తనను జట్టు నుంచి విడుదల చేసిన సమయంలో ఆ నిర్ణయాన్ని మార్చుకునే అవకాశం ఉందా అని నేరుగా ఆ జట్టు సహ యజమాని, బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్‌ను అడిగినట్లు వెల్లడించాడు.
'ఆ సమయంలో నా కళ్లు చెమ్మగిల్లాయి. నేను షారుఖ్ సర్‌ను కూడా ఈ విషయం అడిగాను'' అని అయ్యర్ భావోద్వేగంగా చెప్పాడు.
ఐపీఎల్ 2025 వేలంలో కేకేఆర్ అతడిని ఏకంగా రూ.23.75 కోట్ల భారీ ధరకు తిరిగి కొనుగోలు చేసింది. అయితే ఆ తర్వాత 2026 వేలానికి ముందు విడుదల చేయడంతో తన భవిష్యత్తుపై ముందుగానే ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలిపాడు.
వివరాలు
ఆర్సీబీ అభిమానుల అభిమానం మరో స్థాయిలో ఉంది
ఇకపై తన జెర్సీ పర్పుల్ రంగులో ఉండకపోవచ్చని ముందే మానసికంగా సిద్ధమయ్యానని పేర్కొన్నాడు.
కేకేఆర్ నుంచి బయటకు వచ్చిన తర్వాత డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టులో చేరిన వెంకటేశ్ అయ్యర్‌కు అక్కడ పూర్తిగా భిన్నమైన అనుభవాలు ఎదురయ్యాయి. ఆర్సీబీ అభిమానులు ఆటగాళ్లపై చూపించే అభిమానాన్ని చూసి ఆశ్చర్యపోయినట్లు చెప్పాడు.
'మీరు నమ్మరు.. మ్యాచ్‌లకు ముందు ఆర్సీబీ జెర్సీలకు అభిమానులు పూజలు చేయడం నేను స్వయంగా చూశాను.
అది నాకు చాలా ప్రత్యేకమైన అనుభవం. ఆర్సీబీ అభిమానుల అభిమానం మరో స్థాయిలో ఉంటుందని వెంకటేశ్ అయ్యర్ వివరించాడు.
వివరాలు
ఆర్సీబీ విజయాల్లో కీలక పాత్ర.. 7 మ్యాచ్‌ల్లో 209 పరుగులు
ఐపీఎల్ 2026 సీజన్ ప్రారంభంలో వెంకటేశ్ అయ్యర్‌కు తుది జట్టులో అవకాశం దక్కలేదు.
కొంతకాలం బెంచ్‌కే పరిమితమయ్యాడు. అయితే ఆ తర్వాత ఇంపాక్ట్ ప్లేయర్‌గా బరిలోకి దిగి తన బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు.
ఒక మ్యాచ్‌లో కేవలం 15 బంతుల్లోనే 29 పరుగులు సాధించి సత్తా చాటాడు. పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 40 బంతుల్లో అజేయంగా 73 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.
ఈ సీజన్‌లో మొత్తం 7 మ్యాచ్‌లు ఆడిన వెంకటేశ్ అయ్యర్.. 52.25 సగటుతో 209 పరుగులు సాధించాడు. ఆర్సీబీ వరుసగా రెండోసారి ఐపీఎల్ టైటిల్ గెలుచుకోవడంలో తన వంతు సహకారం అందించాడు. ఇ