LOADING...
Shubman Gill: ఆ ఒక్క ఫుట్‌వర్క్ మెరుగుపడితే గిల్ రాణించగలడు : సంజయ్ బంగర్ 
ఆ ఒక్క ఫుట్‌వర్క్ మెరుగుపడితే గిల్ రాణించగలడు : సంజయ్ బంగర్

Shubman Gill: ఆ ఒక్క ఫుట్‌వర్క్ మెరుగుపడితే గిల్ రాణించగలడు : సంజయ్ బంగర్ 

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 19, 2025
11:38 am

ఈ వార్తాకథనం ఏంటి

టీమిండియా టీ20 జట్టు వైస్‌ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ప్రస్తుతం ఫామ్‌ లేక ఇబ్బంది పడుతున్న విషయం తెలిసిందే. 15 ఇన్నింగ్స్‌లో 137.3 స్ట్రైక్‌ రేట్‌తో కేవలం 291 పరుగులు మాత్రమే సాధించగా, వైట్‌బాల్‌ క్రికెట్‌లో గిల్ గత 21 ఇన్నింగ్స్‌లలో ఒక్క హాఫ్‌ సెంచరీ కూడా నమోదు చేయలేకపోయాడు. ఈ పరిస్థితిపై టీమ్‌ఇండియా మాజీ బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్ తన విశ్లేషణతో గిల్‌కు సూచనలు ఇచ్చారు. "ప్రారంభంలో అతడి ఫుట్‌ వర్క్ బాగుంది. కానీ గత 28 మ్యాచ్‌ల్లో బౌండరీలకు వచ్చిన బంతులు తప్పించి, మిగతా బాల్స్ ఆడే సమయంలో, ముఖ్యంగా నేరుగా వచ్చే బంతుల విషయంలో అతడి ఫుట్‌ వర్క్ సరిగా లేదు.

Details

గిల్ స్ట్రైక్ రేట్ పడిపోయింది

దాంతో అతడి స్ట్రైక్ రేట్ కూడా పడిపోయిందని బంగర్ వ్యాఖ్యానించారు. గిల్ ఆఫ్‌ స్టంప్ అవుట్‌సైడ్ బంతులను ఆడే విషయాల్లో మంచి ప్రదర్శన చూపిస్తున్నప్పటికీ, మొత్తం చూసుకుంటే ఇంకా మెరుగుదలకు అవకాశం ఉందని బంగర్ చెప్పారు. దక్షిణాఫ్రికా తో రెండో టీ20లో అతడు అద్భుతమైన బంతికి అవుట్ అయ్యాడు. నిజానికి ఆ బాల్‌కి ఏ బ్యాటర్ వెనుదిరిగే అవకాశం ఉంది. అతడు ఫుట్‌వర్క్ మెరుగుపరిచితే మరిన్ని పరుగులు రాబట్టగలడు. ఇప్పటి వరకు అతడి మూడు, నాలుగు బౌండరీలు కూడా ఇలా వచ్చినవేనని ఆయన చెప్పారు. ఇక ఓపెనర్ అభిషేక్ శర్మను బంగర్ ప్రశంసించారు. అతడి అటాకింగ్ బ్యాటింగ్ గొప్పది. మైండ్‌సెట్‌ కీలక పాత్ర పోషిస్తోంది.

Details

2-1తో ఆధిక్యంలో భారత జట్టు

కవర్స్ మీదుగా బంతులను తరలించగలగడం అతడి ప్రత్యేక నైపుణ్యమని పేర్కొన్నారు. అలాగే హార్దిక్ పాండ్య ఆల్‌రౌండర్ పాత్రకు బంగర్ సంతృప్తి వ్యక్తం చేశారు. పాండ్య బహుముఖ ప్రజ్ఞతో భారత జట్టుకు సరైన బ్యాలెన్స్‌ను అందిస్తున్నాడని ఆయన పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో కొన్ని గంటల్లో అహ్మదాబాద్ వేదికగా టీమ్‌ఇండియా, దక్షిణాఫ్రికా మద్య సిరీస్‌లో చివరిదైన ఐదో టీ20 మ్యాచ్ జరుగనున్నది. నాలుగో టీ20 పొగమంచు కారణంగా రద్దైన విషయం తెలిసిందే. ప్రస్తుతానికి భారత జట్టు సిరీస్‌లో 2-1తో ఆధిక్యంలో ఉంది. ఐదో మ్యాచ్ గెలిచి సిరీస్‌ను కైవసం చేసుకోవాలని టీమ్‌ఇండియా చూస్తోంది. అదే సమయంలో సఫారీలు అహ్మదాబాద్‌లో విజయం సాధించి సిరీస్‌ను సమం చేయాలనే ఆశలో ఉన్నాయి.

Advertisement