
Asia Cup 2025: ఆసియా కప్ 2025 పై ఉగ్రదాడి ప్రభావం..? ఇండియా-పాక్ మ్యాచ్‌పై సస్పెన్స్!
ఈ వార్తాకథనం ఏంటి
పహల్గామ్ ఉగ్రదాడిపై దేశవ్యాప్తంగా తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. ఈ దాడి కేవలం వెనుక పాకిస్థాన్ హస్తం ఉందన్న అనుమానాలు బలంగా వినిపిస్తున్నాయి.
ఈ పరిణామాల నేపథ్యంలో భారతదేశం - పాకిస్థాన్ (India - Pakistan) క్రికెట్ మ్యాచ్‌లపై మళ్లీ చర్చ మొదలైంది.
భారత్ అభిమానులు ఈ రెండు దేశాల మధ్య జరిగే క్రికెట్ సిరీస్‌లను పునరాలోచించాలని నిర్వాహకులకు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆసియా కప్ 2025 (Asia Cup 2025) నిర్వహణపై కూడా గందరగోళం నెలకొంది.
సెప్టెంబర్‌లో జరగాల్సిన ఈ టోర్నమెంట్ వేదిక ఇప్పటికీ ఖరారు కాలేదు. తటస్థ వేదికపై నిర్వహించాలన్న ఆలోచనలు ఉన్నప్పటికీ, పహల్గామ్ ఉగ్రదాడి ప్రభావం ఈ టోర్నీపై పడుతుందని భావిస్తున్నారు.
Details
భారత్ - బంగ్లాదేశ్ ద్వైపాక్షిక సిరీస్ కూడా అనుమానం
మరోవైపు ఆగస్టులో జరగాల్సిన భారత్ - బంగ్లాదేశ్ (IND - BAN) ద్వైపాక్షిక సిరీస్ కూడా అదే విధంగా కష్టాల్లో పడే అవకాశం ఉందని సమాచారం.
ఇక భారత ప్రభుత్వం కూడా పాకిస్థాన్‌తో మ్యాచ్‌లకు అనుమతి ఇవ్వకపోవడం ఈ సమస్యను మరింత క్లిష్టతరం చేస్తోంది. క్రికెట్ ప్రేమికుల అభిప్రాయంలో, ఇండియా - పాకిస్థాన్ మ్యాచ్‌లు లేకపోతే ఆసియా కప్‌కు ప్రత్యేక ఆకర్షణ ఉండదని చెబుతున్నారు.
ఈ నేపథ్యంలో టోర్నమెంట్ వాయిదా పడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అటు క్రికెట్ బోర్డుల మధ్య చర్చలు కొనసాగుతున్నప్పటికీ, ప్రభుత్వ స్థాయిలో ఏ నిర్ణయం వెలువడాల్సి ఉంది.
వాస్తవానికి ఈ ఉగ్రదాడి తాలూకు ప్రభావం క్రీడా రంగంపైనా తీవ్రంగా పడుతుందన్నది స్పష్టమవుతోంది.