IND Vs SL : కాసేపట్లో ఇండియా, శ్రీలంక మధ్య మ్యాచ్.. గెలుపు ఉత్సాహంతో ఇరు జట్లు!
ఆసియా కప్ సూపర్-4 మ్యాచులో భాగంగా పాకిస్తాన్ పై గెలుపొందిన భారత్ జట్టు నేడు మరో రసవత్తర పోరుకు సిద్ధమైంది. వరుసగా 13 విజయాలు సాధించిన జోరుమీదున్న శ్రీలంక, భారత జోరును అడ్డుకుంటుందా లేదో వేచి చూడాలి. మంగళవారం కొలంబోలోని ఆర్ ప్రేమదాస స్టేడియంలో ఇరు జట్ల మధ్య మధ్యాహ్నం 3 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఇక్కడి పిచ్ బ్యాటింగ్ కు అనుకూలంగా ఉండనుంది. అయితే మేఘావృతమైన పరిస్థితులు ఉండటంతో పేసర్లకు పిచ్ సపోర్టు చేయనుంది. మ్యాచ్ స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో ప్రత్యక్ష ప్రసారం కానుంది. శ్రీలంక, భారత్ జట్టు ఇప్పటివరకూ 165 వన్డేల్లో తలపడ్డాయి. ఇందులో భారత్ 96 మ్యాచుల్లో గెలుపొందగా, 57 మ్యాచుల్లో శ్రీలంక నెగ్గింది.
ఇరు జట్లలోని ఆటగాళ్లు వీరే!
ఇక స్వదేశంలో ఇరు జట్లు 64 సార్లు వన్డేల్లో తలపడ్డాయి. ఇందులో టీమిండియా 38 మ్యాచుల్లో నెగ్గి, 28 మ్యాచుల్లో ఓటమిపాలైంది. ఆసియా కప్ వన్డే ఎడిషన్లో శ్రీలంకపై భారత్ తొమ్మిది విజయాలు, 10 ఓటములను కలిగి ఉంది. శ్రీలంక జట్టు పాతుమ్ నిస్సాంక, దిముత్ కరుణరత్నే, కుసల్ మెండిస్ (డబ్ల్యూకే), సదీర సమరవిక్రమ, చరిత్ అసలంక, ధనంజయ డి సిల్వా, దసున్ షనక (సి), దునిత్ వెల్లలగే, మహేశ్ తీక్షణ, కసున్ రజిత, మతీషా పతిరణ. భారత్ జట్టు రోహిత్ శర్మ (సి), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, కెఎల్ రాహుల్ (వికెట్), ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, జడేజా, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, బుమ్రా, మహ్మద్ సిరాజ్.