INDvsAUS : ఓవర్ కాన్ఫిడెన్స్ వల్లే టీమిండియా ఓడిపోయింది
టీమిండియా కంచుకోటలో భారత్ ఓడటం అసంభవం. ఇండోర్ లోని హోల్కర్ స్టేడియంలో ఆడిన టెస్టులో ఇప్పటివరకు టీమిండియాకు ఓటమి లేదు. అలాంటిది ఆ మైదానంలో టీమిండియా తొమ్మిది వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. ఆస్ట్రేలియా భారత్‌కు ఓటమి రుచిని చూపించింది. ఆ పిచ్‌పై ఎంతోమంది క్రీడా నిపుణులు విమర్శలు చేస్తున్నారు. తాజాగా ఐసీసీ మూడు డీమెరిట్ పాయింట్లతో ఐసీసీ పిచ్ నాసిరకంగా ఉందని ప్రకటించింది. మూడో టెస్టులో మొత్తం 31 వికెట్లు పడ్డాయి. ఇందులో 26 వికెట్లను స్పిన్నర్లే తీయడం విశేషం. దీంతో మూడో రోజు ఉదయమే ఆట ముగిసింది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి వ్యాఖ్యతగా వ్యవహరిస్తున్న రవిశాస్తి.. మూడో టెస్టు అనంతరం టీమిండియా పరాజయంపై స్పందించారు.
పిచ్‌పై మాజీ క్రికెటర్ల అభిప్రాయం
భారత ఆటగాళ్లకు అతివిశ్వాసం, నమ్మకం ఎక్కువైనప్పుడు ఆటగాళ్ల కళ్లు నెత్తికెక్కుతాయని, దాంతో ప్రత్యర్థిని తక్కువగా తీసుకోవడం వల్ల భారత్ పరాజయం పాలైందని టీమిండియా మాజీ క్రికెటర్ రవిశాస్త్రి పేర్కొన్నారు. ఆసీస్ ను తక్కువ అంచనా వేశారని, భారత ఆటగాళ్లు బ్యాటింగ్‌లో వైఫల్యం చెందారని, అందుకే టీమిండియా ఓడిపోయిందని సునీల్ గవాస్కర్ పేర్కొన్నారు. ఈ గేమ్‌లో టీమిండియా ఓడిపోవడం ఆ సాధరమణని, కొన్ని పిచ్‌లు ఒక్కొసారి ఇతర జట్టుకు విజయాలందిస్తామని హర్షా భోగ్లే ట్వీట్ చేశాడు. ఇండోర్ పిచ్ పరమ చెత్తగా ఉందని మార్క్ టేలర్ అభిప్రాయపడ్డాడు.