ఇండోర్ పిచ్‌పై ఐసీసీ ఘాటు వ్యాఖ్యలు
భారత్-ఆస్ట్రేలియా మధ్య మూడో టెస్టు కోసం ఇండోర్ హోల్కర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన పిచ్‌పై ఐసీసీ తీవ్ర విమర్శలు చేసింది. ఈ మ్యాచ్ మూడో రోజు ఉదమయే ముగిసిపోవడంతో పిచ్‌పై విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో ఇండోర్‌లోని హోల్కర్ స్టేడియం మూడు డీమెరిట్ పాయింట్లను అందుకుంది. ఈ నేపథ్యంలో మ్యాచ్ ముగిసిన అనంతరం రిఫరీ క్రిస్ బ్రాడ్ ఐసీసీకి నివేదిక సమర్పించింది. ఇరు జట్ల కెప్టెన్లు రోహిత్ శర్మ, స్టీవ్ స్మిత్ ల అభిప్రాయాలను ఆ నివేదికలో పొందుపరిచారు. ఇండోర్ పిచ్ నాసిరకగా ఉందని ఐసీసీ తెలిపింది. ఐసీసీ నిర్ణయంపై అప్పీల్ చేసేందుకు బీసీసీఐకీ 14 రోజులు గడువు ఇవ్వడం గమనార్హం.
ఐదేళ్ల పాటు స్టేడియంపై నిషేదం పడే అవకాశం
తొలిరోజు నుంచే స్పిన్నర్లకు సహకారం లభించడంతో తొలి మూడు టెస్టు మూడు రోజుల్లోనే ముగిసింది. స్పిన్ అనుకూల పరిస్థితులకు జోడిస్తూ ఇండోర్ ట్రాక్ కూడా అసమాన బౌన్స్‌ను కలిగి ఉండటంతో తొలి రెండు రోజుల్లో 30 వికెట్లు పడిపోయాయి. ఇందులో 26 వికెట్లు స్పిన్నర్లకే పడడం విశేషం. ICC పిచ్, ఔట్‌ఫీల్డ్ మానిటరింగ్ ప్రకారం ఐదు సంవత్సరాల వ్యవధిలో ఐదు లేదా అంతకంటే ఎక్కువ డీమెరిట్ పాయింట్లను అందజేస్తే అంతర్జాతీయ మ్యాచ్‌ను నిర్వహించకుండా 12 నెలల పాటు సస్పెండ్ చేసే అవకాశం ఉంటుంది. మరోసారి పిచ్‌పై ఇలాంటి సీన్ రిపీట్ అయితే మాత్రం ఐదేళ్ల పాటు స్టేడియంపై నిషేధం పడే అవకాశం ఉందని ఐసీసీ ప్రతినిధి ఒకరు తెలిపారు