Page Loader
IND vs NZ: తొలి టెస్టులో టాస్‌ నెగ్గి బ్యాటింగ్‌ ఎంచుకున్న భారత్.. మ్యాచ్‌లో స్వల్ప మార్పులు
తొలి టెస్టులో టాస్‌ నెగ్గి బ్యాటింగ్‌ ఎంచుకున్న భారత్

IND vs NZ: తొలి టెస్టులో టాస్‌ నెగ్గి బ్యాటింగ్‌ ఎంచుకున్న భారత్.. మ్యాచ్‌లో స్వల్ప మార్పులు

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 17, 2024
09:22 am

ఈ వార్తాకథనం ఏంటి

తొలిరోజు వర్షార్పణంతో భారత్ - న్యూజిలాండ్ జట్ల (IND vs NZ) మధ్య మొదటి టెస్టు ప్రారంభమైంది. టాస్‌ గెలిచిన టీమిండియా బ్యాటింగ్‌ చేసుకోవాలని నిర్ణయించింది. వన్‌డౌన్‌ బ్యాటర్ శుభమన్‌ గిల్ స్థానంలో సర్ఫరాజ్‌ ఖాన్‌కు తుది జట్టులో అవకాశం వచ్చింది. మూడో పేసర్ ఆకాశ్‌ దీప్‌ బదులుగా కుల్‌దీప్‌ యాదవ్‌ను మేనేజ్‌మెంట్ ఎంపిక చేసింది. గిల్ పూర్తిగా ఆరోగ్యంగా లేకపోవడంతో అతనికి విశ్రాంతి ఇవ్వాలని కెప్టెన్ రోహిత్ ప్రకటించాడు. మ్యాచ్‌ షెడ్యూల్‌: తొలి సెషన్: ఉదయం 9:15 గంటల నుంచి 11:30 గంటల వరకు రెండో సెషన్: మధ్యాహ్నం 12:10 గంటల నుంచి 2:25 గంటల వరకు మూడో సెషన్: మధ్యాహ్నం 2:45 గంటల నుంచి సాయంత్రం 4:45 గంటల వరకు

వివరాలు 

తుది జట్లు

భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్‌), యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, సర్ఫరాజ్‌ ఖాన్, రిషభ్‌ పంత్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, కుల్‌దీప్‌ యాదవ్, జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్‌ న్యూజిలాండ్‌: టామ్ లేథమ్ (కెప్టెన్), డేవన్ కాన్వే, విల్ యంగ్, రచిన్ రవీంద్ర, డారిల్ మిచెల్, టామ్‌ బ్లండెల్ (వికెట్‌ కీపర్), గ్లెన్ ఫిలిప్స్‌, మ్యాట్ హెన్రీ, టిమ్ సౌథీ, అజాజ్ పటేల్, విలియమ్‌ ఓరూర్కీ