Ind vs NZ toss: టాస్ గెలిచిన టీమిండియా.. బౌలింగ్ ఎంచుకున్న కెప్టెన్ రోహిత్
వన్డే ప్రపంచ కప్-2023లో భాగంగా హిమాచల్ ప్రదేశ్ ధర్మశాలలోని హెచ్‌పీసీఏ స్టేడియం వేదికగా ఆదివారం టీమిండియా- న్యూజిలాండ్ జట్లు తలపడుతున్నాయి. టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ బౌలింగ్ ఎంచుకున్నాడు. న్యూజిలాండ్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. ఈ ప్రపంచకప్‌లో టీమిండియా, న్యూజిలాండ్ జట్లు చెరొక నాలుగు విజయలతో ఊపుమీద ఉన్నాయి. ఈ టోర్నీలో రెండు జట్లను ఓటమిని చవిచూడలేదు. గత మ్యాచ్‌లో గాయపడ్డ హార్దిక్ పాండ్యా.. న్యూజిలాండ్‌తో జరుగుతున్న మ్యాచ్ కు దూరమయ్యాడు.
న్యూజిలాండ్ బ్యాటింగ్
టీమ్‌లోకి మహమ్మద్ షమీ, సూర్యకుమార్ యాదవ్
భారత్ (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్-కీపర్), సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్. న్యూజిలాండ్ (ప్లేయింగ్ XI): డెవాన్ కాన్వే, విల్ యంగ్, రచిన్ రవీంద్ర, డారిల్ మిచెల్, టామ్ లాథమ్ (కెప్టెన్ మరియు వికెట్ కీపర్), గ్లెన్ ఫిలిప్స్, మార్క్ చాప్‌మన్, మిచెల్ సాంట్నర్, మాట్ హెన్రీ, లాకీ ఫెర్గూసన్ మరియు ట్రెంట్ బౌల్ట్.