
Ind vs Pak: అదరగొట్టిన టీమిండియా బౌలర్లు.. పాకిస్థాన్ 191 పరుగులకు ఆలౌట్
ఈ వార్తాకథనం ఏంటి
ఐసీసీ ప్రపంచ కప్ 2023లో భాగంగా అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో శనివారం జరుగుతున్న మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ జట్టును 191 పరుగులకే టీమిండియా బౌలర్లు ఆలౌట్ చేశారు.
టీమిండియా ముందు పాకిస్థాన్ 192 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది.
వాస్తవానికి పాకిస్థాన్‌కు మంచి ఆరంభం లభించింది. కానీ బాబర్ అజామ్ ఔట్ అయిన తర్వాత పాకిస్థాన్ వికెట్ల పతనం మొదలైంది.
ఒక దశలో 155/2తో పటిష్టంగా ఉన్న పాకిస్థాన్ జట్టు.. చివరి 36 పరుగులకు ఏకంగా 8వికెట్లను పోగొట్టుకుంది.
ఈ నెంబర్ ను చూస్తే భారత బౌలర్లు ఎంత పటిష్టంగా బౌలింగ్ వేశారో అర్థం అవుతుంది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
టీమిండియా టార్గెట్ 192 పరుగులు
ICC World Cup | Pakistan 191-all out against India at Narendra Modi Stadium in Ahmedabad.
— ANI (@ANI) October 14, 2023
(Babar Azam 50, Mohammad Rizwan 49, Jasprit Bumrah 2-19, Hardik Pandya 2-34)#INDvPAK pic.twitter.com/DuiLuB7eBw