Hardik Pandya : అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా అరుదైన మైలురాయి..
ఈ వార్తాకథనం ఏంటి
టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో ప్రత్యేక మైలురాయిని సాధించాడు. భారత్ తరుపున టీ20ల్లో 100 సిక్సర్లు కొట్టిన ఆటగాడిగా నిలిచాడు. మంగళవారం కటక్ వేదికలో దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో నాలుగు సిక్సర్లు కొట్టి ఈ ఘనతను సాధించాడు. టీమిండియా తరుపున 100 సిక్సర్ల మైలురాయిని తాకిన నాలుగో ఆటగాడిగా పాండ్యా రికార్డుల్లో చోటు సంపాదించాడు. ఈ ఘనతకు ముందు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్‌లు ఈ ఘనత సాధించారు.
వివరాలు
అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన భారత ప్లేయర్లు వీరే..
రోహిత్ శర్మ- 151 ఇన్నింగ్స్‌లలో 205 సిక్సర్లు సూర్యకుమార్ యాదవ్ - 90 ఇన్నింగ్స్‌ల్లో 155 సిక్సర్లు విరాట్ కోహ్లీ - 117 ఇన్నింగ్స్‌లలో 124 సిక్సర్లు హార్దిక్ పాండ్యా - 95 ఇన్నింగ్స్‌లలో 100 సిక్సర్లు కేఎల్ రాహుల్ - 68 ఇన్నింగ్స్‌లలో 99 సిక్సర్లు
ట్విట్టర్ పోస్ట్ చేయండి
బీసీసీఐ చేసిన ట్వీట్
𝐂𝐞𝐧𝐭𝐮𝐫𝐲 𝐨𝐟 𝐌𝐚𝐱𝐢𝐦𝐮𝐦𝐬 💯
— BCCI (@BCCI) December 9, 2025
1⃣0⃣0⃣ T20I sixes for Hardik Pandya 🔥
Updates ▶️ https://t.co/tiemfwcNPh #INDvSA | @IDFCFIRSTBank pic.twitter.com/mZjJXhr5S9