Page Loader
IND-W vs ENG-W: చరిత్ర సృష్టించిన మహిళా క్రికెటర్లు.. భారీ విజయం 
IND-W vs ENG-W: చరిత్ర సృష్టించిన మహిళా క్రికెటర్లు.. భారీ విజయం

IND-W vs ENG-W: చరిత్ర సృష్టించిన మహిళా క్రికెటర్లు.. భారీ విజయం 

వ్రాసిన వారు Stalin
Dec 16, 2023
03:00 pm

ఈ వార్తాకథనం ఏంటి

మహిళా క్రికెటర్లు టెస్ట్‌ ఫార్మాట్‌లో చరిత్ర సృష్టించారు. ముంబైలో జరిగిన ఏకైక టెస్ట్‌లో ఇంగ్లాండ్‌పై చారిత్రక విజయాన్ని నమోదు చేశారు. 347 పరుగుల తేడాతో ఇంగ్లాండ్ జట్టుపై భారీ విజయాన్ని నమోదు చేసింది. ఉమెన్స్ టెస్ట్‌ క్రికెట్‌ చరిత్రలో ఇదే అతిపెద్ద విజయం. మహిళా క్రికెట్‌లో టెస్ట్ మ్యాచ్.. నాలుగు రోజుల పాటు జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన ఉమెన్స్ టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో.. 428 పరుగులు చేసింది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లాండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 136 పరుగులు మాత్రమే చేసింది. అనంతరం రెండో ఇన్నింగ్స్‌కు దిగిన టీమిండియా 6వికెట్లు కోల్పోయి.. 186పరుగులు చేసింది. ఆ తర్వాత టీమిండియా డిక్లేర్‌ చేసింది.

మహిళా

9వికెట్లతో ఇంగ్లాండ్ ఓటమిని శాసించిన దీప్తి

రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ జట్టు 131 పరుగులకే కుప్పకూలిపోయింది. దీంతో 347 పరుగుల తేడాతో మహిళల ఉమెన్స్ టీమ్ విజయం సాధించింది. ఈ స్పిన్‌కు అనుకూలించే ఈ పిచ్‌పై 9వికెట్లను నేలకూల్చిన దీప్తి శర్మ ఇంగ్లాండ్‌ ఓటమిని శాసించి.. ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా ఎంపికైంది. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన టీమిండియా బ్యాటింగ్‌ ఎంచుకుంది. తొలి టెస్ట్‌ ఆడుతున్న శుభా సతీష్‌ 69, జెమీమా రోడ్రిగ్స్‌ 68 రన్స్ చేశారు. వీరు మూడో వికెట్‌కు 115 పరుగుల పార్టనర్ షిప్ చేశారు. కెప్టెన్‌ హర్మన్‌ ప్రీత్ 49 రన్స్, యాస్తిర్‌ బాటియా 66 చేశారు.