తదుపరి వార్తా కథనం

IND vs BAN : బంగ్లాపై గెలుపు.. ఫైనల్ కు దూసుకెళ్లిన భారత్
వ్రాసిన వారు
Jayachandra Akuri
Sep 24, 2025
11:39 pm
ఈ వార్తాకథనం ఏంటి
ఆసియా కప్ 2025లో టీమిండియా జైత్రయాత్ర కొనసాగిస్తోంది. తాజాగా ఇవాళ బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచులో గెలుపొంది, టీమిండియా ఫైనల్ కు అర్హత సాధించింది. మొదట బ్యాటింగ్ భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 168 పరుగుల చేసింది. లక్ష్య చేధనలో భారత బౌలర్లు విజృంభించడతో బంగ్లా బ్యాటర్లు 127 పరుగులకే ఆలౌటయ్యారు. దీంతో భారత జట్టు 41 పరుగుల తేడాతో గెలుపొందింది. ఓపెనర్ సైఫ్ హాసన్(69) ఒక్కడే పోరాడినా ఫలితం లేకుండా పోయింది. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ 3, వరుణ్, బుమ్రా తలా రెండు వికెట్లు తీశారు.