NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / క్రీడలు వార్తలు / Ind vs Ban: ఇంగ్లండ్‌ రికార్డను బద్దలుకొట్టిన  భారత్‌.. తక్కువ బంతుల్లో 50 పరుగులు  
    తదుపరి వార్తా కథనం
    Ind vs Ban: ఇంగ్లండ్‌ రికార్డను బద్దలుకొట్టిన  భారత్‌.. తక్కువ బంతుల్లో 50 పరుగులు  
    ఇంగ్లండ్‌ రికార్డను బద్దలుకొట్టిన భారత్‌

    Ind vs Ban: ఇంగ్లండ్‌ రికార్డను బద్దలుకొట్టిన  భారత్‌.. తక్కువ బంతుల్లో 50 పరుగులు  

    వ్రాసిన వారు Sirish Praharaju
    Sep 30, 2024
    01:58 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    భారత ఓపెనర్లు బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో (IND vs BAN) అద్భుతమైన ప్రదర్శన చేసి, ప్రపంచ టెస్టు క్రికెట్‌లో అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు.

    బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 233 పరుగులకు ఆలౌట్ అయ్యింది. అనంతరం టీమిండియా తన తొలి ఇన్నింగ్స్‌ను ప్రారంభించింది.

    రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్ ఓపెనర్లు గా బరిలోకి దిగారు.మొదటి ఓవర్ నుండే దూకుడుగా ఆడారు.

    ఈ క్రమంలో, కేవలం 18 బంతుల్లోనే 50+ పరుగులు జోడించడంతో, 147 ఏళ్ల టెస్టు క్రికెట్‌లో అత్యంత వేగంగా హాఫ్‌ సెంచరీ సాధించిన జోడీగా నిలిచారు.

    వివరాలు 

    యశస్వి హాఫ్‌ సెంచరీ

    ఈ రికార్డు గతంలో బజ్‌బాల్ క్రికెట్ ఆడుతున్న ఇంగ్లండ్ బ్యాటర్లు బెన్ డకెట్, బెన్ స్టోక్స్ పేరిట ఉండేది. వారు 26 బంతుల్లో 50+ పరుగులు సాధించారు.ఇప్పుడు ఈ రికార్డును రోహిత్, యశస్వి బద్దలు కొట్టారు.

    యశస్వి హాఫ్‌ సెంచరీ

    యశస్వి తన ఓపెనింగ్ పార్టనర్ రోహిత్ (23: 11 బంతుల్లో 3 సిక్స్‌లు,1 ఫోర్) ఔటైన తర్వాత కూడా తన జోరు తగ్గించలేదు.

    బౌండరీలతో విరుచుకుపడ్డ యశస్వి కేవలం 31 బంతుల్లో హాఫ్‌ సెంచరీ పూర్తి చేశాడు. దీంతో భారత టెస్టు చరిత్రలో అత్యంత వేగంగా అర్ధశతకం సాధించిన నాలుగో బ్యాటర్‌గా నిలిచాడు.

    పంత్ (28 బంతుల్లో), కపిల్ (30 బంతుల్లో), శార్దూల్ (31 బంతుల్లో) కంటే ముందున్నాడు.

    వివరాలు 

    12.2 ఓవర్లలోనే విండీస్‌పై 100 

    ఫాస్టెస్ట్ 100 భారత జట్టు కేవలం 10.1 ఓవర్లలోనే 100 పరుగుల మార్క్‌ను తాకింది.

    ఈ సందర్భంగా, టెస్టుల్లో అత్యంత వేగంగా 100 పరుగులు చేసిన జట్టుగా భారత్ తన రికార్డును అధిగమించడం విశేషం.

    2023లో, టీమిండియా 12.2 ఓవర్లలోనే విండీస్‌పై 100 కొట్టిన సందర్భం కూడా ఉంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    టీమిండియా

    తాజా

    RCB: ఆర్సీబీ జట్టులో అనుకోని మార్పు.. ఇంగ్లండ్ ఆటగాడు జాకబ్ బెతెల్ ప్లేఆఫ్స్‌కు దూరం  రాయల్ చాలెంజర్స్ బెంగళూరు
    Jammu Kashmir: జమ్ముకశ్మీర్‌లోని కిష్త్వార్‌లో ఉగ్రవాదులతో ఎన్‌కౌంటర్‌.. జవాన్ వీరమరణం  జమ్ముకశ్మీర్
    All party delegations: ఉగ్రవాదంపై పోరులో భారత్‌కు మద్దతుగా యూఏఈ, జపాన్‌ ఆపరేషన్‌ సిందూర్‌
    #NewsBytesExplainer: అంతరిక్షం నుండి కనిపించే ఏకైక మానవ నిర్మాణం ... ఎక్కడ ఉందంటే..? అంతరిక్షం

    టీమిండియా

    Suryakumar Yadav: టీమిండియా జట్టులో గ్రూపులు లేవు.. జట్టుగానే కలిసి ఉన్నాం  సూర్యకుమార్ యాదవ్
    IND vs SL : రాణించిన బౌలర్లు.. భారత ముందు స్వల్ప టార్గెట్  శ్రీలంక
    IND vs SL : భారత్ వర్సెస్ శ్రీలంక మ్యాచ్ టై శ్రీలంక
    SL vs IND : టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక శ్రీలంక
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025