Loading...
FIH Womens Junior World Cup: మహిళల ఆసియా కప్ జూనియర్ హాకీలో భారత్‌ హ్యాట్రిక్‌.. మూడోసారి ఛాంపియన్‌!
మహిళల ఆసియా కప్ జూనియర్ హాకీలో భారత్‌ హ్యాట్రిక్‌.. మూడోసారి ఛాంపియన్‌!

FIH Womens Junior World Cup: మహిళల ఆసియా కప్ జూనియర్ హాకీలో భారత్‌ హ్యాట్రిక్‌.. మూడోసారి ఛాంపియన్‌!

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 13, 2026
04:54 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆసియా కప్ జూనియర్ హకీ టోర్నమెంట్‌ (FIH Women's Junior World Cup)లో భారత మహిళల జట్టు అద్భుత విజయాన్ని నమోదు చేసింది. చైనాలో జరిగిన ఫైనల్‌లో ప్రత్యర్థిపై 1-0 తేడాతో విజయం సాధించి స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో నమోదైన ఏకైక గోల్‌ను భారత క్రీడాకారిణి సానిక చంద్రకాంత్ మనే 17వ నిమిషంలో సాధించింది. ఆమె చేసిన గోల్‌ భారత్‌కు ఆధిక్యాన్ని అందించగా.. ఆ తర్వాత ప్రత్యర్థికి ఎలాంటి అవకాశం ఇవ్వకుండా భారత జట్టు మ్యాచ్‌ను 1-0తో ముగించింది.

వివరాలు

ఈ కప్‌ను గెలుచుకోవడం వరుసగా మూడోసారి

భారత మహిళల జట్టు ఈ కప్‌ను గెలుచుకోవడం వరుసగా మూడోసారి కావడం విశేషం. ఈ విజయంతో జూనియర్ ప్రపంచ కప్‌లోనూ భారత్‌కు స్థానం ఖరారైంది.

ఛాంపియన్స్‌గా నిలిచిన భారత జట్టుకు హాకీ ఇండియా నగదు ప్రోత్సాహకాన్ని ప్రకటించింది. జట్టులోని ప్రతి క్రీడాకారిణికి రూ.3 లక్షల చొప్పున నగదు బహుమతి ఇవ్వనున్నట్లు తెలిపింది.

అలాగే సహాయక సిబ్బందిలో ప్రతి ఒక్కరికీ రూ.1.5 లక్షల చొప్పున నగదు ప్రోత్సాహం అందించనున్నట్లు వెల్లడించింది.

ADVERTISEMENT