మూడో వన్డేలో భారత్‌కు రికార్డ్ విక్టరీ
శ్రీలంకతో జరిగిన మూడో వన్డేలో భారత్ అతిపెద్ద విజయాన్న నమోదు చేసింది. 317 పరుగుల తేడాతో భారత్ విజయం సాధించి రికార్డులను బద్దలు కొట్టింది. దీంతో మూడు వన్డేల సిరీస్ ను భారత్ 3-0తో కైవసం చేసుకుంది. విరాట్ కోహ్లీ, శుభ్ మన్ గిల్ సెంచరీలు సాధించడంతో భారత్ 390/5 భారీ స్కోరు చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్‌కు గిల్, రోహిత్ శర్మ 95 పరుగులు జోడించారు. గిల్ 97 బంతుల్లో 116 పరుగులు, కోహ్లీ 110 బంతుల్లో 166 పరుగులు చేశారు. గిల్ వన్డేలో రెండు సెంచరీలను పూర్తి చేశాడు. 18 మ్యాచ్‌ల్లో 59.60 సగటుతో 894 పరుగులు చేశాడు. రోహిత్ వన్డేల్లో 48.71 సగటుతో 9,596 పరుగులు చేశాడు.
టీమిండియాకు అతిపెద్ద విజయం
మూడో వన్డేలో ఒక వికెట్ తీయకుండా శ్రీలంక లెగ్‌స్పిన్నర్ హసరంగా చెత్త రికార్డును మూటకట్టుకున్నాడు. వన్డేక్రికెట్‌లో కోహ్లీ 150 ప్లస్ స్కోరును ఐదుసార్లు చేశారు. వెస్టిండీస్ దిగ్గజం వివ్ రిచర్డ్స్ (3) కోహ్లీ కంటే వెనుకంజలో ఉన్నాడు. వన్డేలో మహమ్మద్ సిరాజ్ 4 వికెట్లు పడగొట్టి సత్తా చాటాడు. సిరాజ్ 19 వన్డేల్లో 33 వికెట్లు తీశాడు.4/32 తో కెరీర్‌లో అద్భుత బౌలింగ్ ప్రదర్శన చేశాడు. షమీ రెండు, కుల్దీప్ రెండు వికెట్లు తీసి భారత్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. వన్డే క్రికెట్‌లో 317 పరుగుల తేడాతో టీమిండియా అతిపెద్ద విజయాన్ని నమోదు చేసింది. గతంలో న్యూజిలాండ్ (190 పరుగులు vs ఐర్లాండ్, 2008) పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టింది.