LOADING...
IND vs PAK : హాంగ్ కాంగ్ సిక్స్ 2025 టోర్నమెంట్.. ఇంకోసారి పాక్‌కి షాక్ ఇచ్చిన టీమిండియా 
హాంగ్ కాంగ్ సిక్స్ 2025 టోర్నమెంట్..ఇంకోసారి పాక్‌కి షాక్ ఇచ్చిన టీమిండియా

IND vs PAK : హాంగ్ కాంగ్ సిక్స్ 2025 టోర్నమెంట్.. ఇంకోసారి పాక్‌కి షాక్ ఇచ్చిన టీమిండియా 

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 07, 2025
05:06 pm

ఈ వార్తాకథనం ఏంటి

క్రికెట్ ప్రేమికుల్ని మళ్ళీ అలరించే మరో టోర్నీగా హాంగ్ కాంగ్ సిక్స్ 2025 ప్రారంభమైంది. ఈ టోర్నమెంట్ ఆరంభ మ్యాచ్‌లోనే భారత్-పాకిస్తాన్ జట్లు తలపడగా,ఆ మ్యాచ్ అసలైన థ్రిల్లర్‌గా మారింది. మాజీ క్రికెటర్ రాబిన్ ఉతప్ప ధాటిగా రాణించడంతో భారత్ భారీ స్కోరు నమోదు చేసింది. అనంతరం వర్షం అంతరాయం కలిగించడంతో డక్‌వర్త్-లూయిస్ పద్ధతి ఆధారంగా భారత్ రెండు పరుగుల తేడాతో పాకిస్తాన్‌ను మరోసారి ఓడించి శుభారంభం చేసింది. మాంగ్ కాక్ వేదికగా టాస్ గెలిచిన భారత్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. రాబిన్ ఉతప్పకు జతగా భరత్ చిప్లి ఓపెనింగ్‌కు వచ్చారు. వీరు కేవలం మొదటి 2 ఓవర్లలోనే 34 పరుగులు చేసి ధనాధన్ ఆరంభం అందించారు.

వివరాలు 

మొదటి ఓవర్లోనే 18 పరుగులు రాబట్టిన పాకిస్థాన్ 

ఉతప్ప కేవలం 11 బంతుల్లో 28 పరుగులు బాదుతూ మంచి ఇన్నింగ్స్ ఆడి మూడో ఓవర్లో ఔటయ్యాడు. అతని తర్వాత వచ్చిన స్టువర్ట్ బిన్నీ తొలి బంతికే బౌండరీ కొట్టి, వెంటనే తదుపరి బంతికే ఔటయ్యాడు. దినేష్ కార్తీక్ 6 బంతుల్లో 17 పరుగులు జోడించడంతో భారత్ 6 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి మొత్తం 86 పరుగుల భారీ స్కోరు సాధించింది. 87 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్ ప్రారంభం కూడా ఆగ్రెసివ్‌గా సాగింది. మొదటి ఓవర్లోనే 18 పరుగులు రాబట్టింది. అయితే, రెండో ఓవర్‌లో స్టువర్ట్ బిన్నీ కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి కేవలం 7 పరుగులకే పరిమితం చేశాడు.

వివరాలు 

 డక్‌వర్త్-లూయిస్ ప్రకారం భారత్ రెండు పరుగుల తేడాతో విజయం

మూడో ఓవర్లో షాబాజ్ నదీమ్ 16 పరుగులు ఇచ్చాడు. పాకిస్తాన్ మూడు ఓవర్లు ముగిసే సరికి ఒక వికెట్ నష్టానికి 41 పరుగులు చేసింది. ఈ సమయంలో వర్షం రావడంతో మ్యాచ్ నిలిచిపోయింది. వర్షం కారణంగా మ్యాచ్ తిరిగి ప్రారంభం కాలేకపోవడంతో విజేతను డక్‌వర్త్-లూయిస్ పద్ధతి ద్వారా నిర్ణయించారు. ఆ ప్రకారం భారత్ రెండు పరుగుల తేడాతో విజయం దక్కించుకుంది. ఈ గెలుపుతో భారత్ టోర్నమెంట్‌లో తన ప్రయాణాన్ని విజయవంతంగా మొదలుపెట్టింది.

వివరాలు 

గ్రూప్-సీలో అగ్రస్థానంలో పాకిస్థాన్ 

హాంగ్ కాంగ్ సిక్స్ 2025లో మొత్తం 12 జట్లు పాల్గొంటున్నాయి. ఒక్కో గ్రూప్‌లో మూడు జట్లు చొప్పున నాలుగు గ్రూపులుగా విభజించారు. భారత్, పాకిస్తాన్, కువైట్ జట్లు గ్రూప్-సీలో ఉన్నాయి. ప్రస్తుతం పాకిస్తాన్ రెండు మ్యాచ్‌లలో ఒక విజయం సాధించి పాయింట్స్ టేబుల్‌లో మొదటి స్థానంలో ఉంది. భారత్ ఒక విజయం సాధించి రెండో స్థానంలో కొనసాగుతోంది. ప్రతి గ్రూప్ నుంచి తొలి రెండు జట్లు క్వార్టర్ ఫైనల్స్‌కు అర్హత సాధిస్తాయి.