India vs Bangladesh: బంగ్లాపై భారత్ జోరు సాగుతుందా?.. నేడు ఆసియా కప్ తొలి సెమీస్
ఈ వార్తాకథనం ఏంటి
బ్యాటింగ్ విషయంలో కొన్ని ఇబ్బందులు ఎదురైనా.. మహిళల ఆసియా కప్ లీగ్ దశలో భారత జట్టు దూకుడు కొనసాగించింది. ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ భారీ విజయాలు నమోదు చేసి అలవోకగా సెమీఫైనల్‌కు చేరింది. ఇప్పుడు అసలు నాకౌట్ సమరానికి హర్మన్‌ప్రీత్ కౌర్ సేన సిద్ధమైంది. తమ స్థాయికి తగ్గట్టుగా ఆడితే గురువారం సెమీఫైనల్‌లో బంగ్లాదేశ్‌ను ఓడించడం భారత్‌కు పెద్ద సవాల్ కాకపోవచ్చు. మహిళల ఆసియా కప్‌లో తొలి సెమీఫైనల్‌కు రంగం సిద్ధమైంది. లీగ్ దశలో మూడు మ్యాచ్‌లూ గెలిచి అజేయంగా నిలిచిన భారత్‌తో.. కాస్త పోరాడి నాకౌట్ దశకు వచ్చిన బంగ్లాదేశ్ గురువారం తలపడనుంది. ఈ పోరులో హర్మన్‌ప్రీత్ కౌర్ నేతృత్వంలోని భారత జట్టే స్పష్టమైన ఫేవరెట్‌గా కనిపిస్తోంది.
వివరాలు
స్పిన్నర్లదే పైచేయి..
అయితే దుబాయ్ పిచ్‌పై ప్రత్యర్థి స్పిన్నర్లు సవాలు విసరగల సామర్థ్యం కలిగి ఉండటంతో భారత్ ఏమాత్రం నిర్లక్ష్యం చేయకూడదు.
ముఖ్యంగా బ్యాటింగ్‌లో కనిపిస్తున్న నిలకడలేమిని అధిగమించాల్సిన అవసరం ఉంది.
ఆసియా కప్ లీగ్ దశలో జరిగిన మ్యాచ్‌లను పరిశీలిస్తే.. స్పిన్‌ను సమర్థంగా వేయడంతో పాటు ప్రత్యర్థి స్పిన్నర్లను సమర్థంగా ఎదుర్కొనే జట్టుకే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయని స్పష్టమైంది.
జట్టు స్థాయి చిన్నదా.. పెద్దదా అన్న తేడా లేకుండా దాదాపు ప్రతి జట్టులోనూ స్పిన్నర్లు ప్రభావం చూపించారు.
అదే సమయంలో అన్ని జట్ల బ్యాటర్లు స్పిన్‌ను ఎదుర్కొనే విషయంలో ఇబ్బందులు పడ్డారు. భారత జట్టు కూడా దీనికి మినహాయింపు కాదు.
వివరాలు
స్పిన్నర్లదే పైచేయి..
శ్రీచరణి, దీప్తి శర్మ, ప్రేమ రావత్ తమ స్పిన్ బౌలింగ్‌తో గ్రూప్ దశలో భారత్ ఎదుర్కొన్న ప్రత్యర్థులను ఇబ్బందుల్లోకి నెట్టారు.
ఈ ముగ్గురు కలిసి మూడు మ్యాచ్‌ల్లోనే ఏకంగా 20 వికెట్లు పడగొట్టడం విశేషం. వీరికి తోడుగా పార్ట్‌టైమ్ స్పిన్నర్ షెఫాలి వర్మ కూడా తనవంతు సహకారం అందిస్తోంది.
భారత స్పిన్నర్లను సమర్థంగా ఎదుర్కోవడం నిగర్ సుల్తానా నాయకత్వంలోని బంగ్లాదేశ్‌కు అంత సులభం కాదు.
ఆ జట్టులో నిగర్‌తో పాటు శోభన, షోర్నా చెప్పుకోదగ్గ బ్యాటర్లుగా ఉన్నారు.
మరోవైపు క్రాంతి గౌడ్, నందని శర్మలతో కూడిన భారత పేస్ బౌలింగ్ విభాగం కూడా ఇప్పటివరకు నిలకడగానే రాణిస్తోంది.
వివరాలు
భారత బ్యాటర్లకు బంగ్లాదేశ్ బౌలింగ్ నుంచి గట్టి పరీక్ష ఎదురయ్యే అవకాశం
అయితే బ్యాటింగ్‌లో మాత్రం భారత్‌ను నిలకడలేమి ఇబ్బంది పెడుతోంది. ఓపెనర్లు షెఫాలి వర్మ, స్మృతి మంధాన చెరో మ్యాచ్‌లో అద్భుతంగా రాణించారు.
కానీ మిగతా బ్యాటర్ల నుంచి ఆశించిన స్థాయిలో స్థిరమైన ప్రదర్శన కనిపించలేదు.
మూడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చే ప్రతీకరావల్ ఇప్పటివరకు చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడలేకపోయింది.
కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్,రిచా ఘోష్ కూడా ఈ టోర్నీలో తమ స్థాయికి తగ్గ ప్రదర్శన ఇవ్వలేదు.
బంగ్లాదేశ్ బౌలింగ్ విభాగంలో నహిదా,మారుఫా,రబేయా వంటి ప్రతిభావంతులైన బౌలర్లు ఉన్నారు.
దీంతో గురువారం భారత బ్యాటర్లకు ఈ విభాగం నుంచి గట్టి పరీక్ష ఎదురయ్యే అవకాశముంది.
ముఖ్యంగా భారత ఓపెనర్లు ఆరంభంలోనే పెవిలియన్ చేరితే.. ఆ తర్వాత వచ్చే బ్యాటర్లు ఎంతవరకు బాధ్యత తీసుకుంటారన్నది కీలకంగా మారనుంది.
వివరాలు
గణాంకాల్లో భారత్‌దే ఆధిపత్యం..
దుబాయ్ పిచ్ మరోసారి స్పిన్నర్లకు అనుకూలించే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.
ఈ పరిస్థితుల్లో భారీ స్కోరు నమోదయ్యే అవకాశాలు తక్కువ.
పిచ్ నుంచి తమ స్పిన్నర్లకు లభించే సహకారాన్ని ఏ జట్టు మెరుగ్గా ఉపయోగించుకుంటుందో.. ఆ జట్టుకే విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయి.
అందుకే భారత్, బంగ్లాదేశ్ మధ్య జరిగే సెమీఫైనల్‌లో స్పిన్ బౌలింగ్ కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది.
బంగ్లాదేశ్‌తో ఇప్పటివరకు 24 టీ20 మ్యాచ్‌లు ఆడిన భారత మహిళల జట్టు.. అందులో 21 విజయాలు సాధించింది.
కేవలం మూడు మ్యాచ్‌ల్లోనే ఓటమి ఎదురైంది. ఈ గణాంకాలు కూడా సెమీఫైనల్‌లో భారత్ ఆధిపత్యాన్ని స్పష్టం చేస్తున్నాయి.
వివరాలు
టాప్‌స్కోరర్‌గా నిలవడానికి 69 పరుగుల దూరంలో..
మహిళల టీ20 క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా నిలిచేందుకు భారత ఓపెనర్ స్మృతి మంధానకు మరో 69 పరుగులు మాత్రమే అవసరం.
ప్రస్తుతం ఆమె 4,758 పరుగులతో అగ్రస్థానంలో ఉన్న న్యూజిలాండ్ బ్యాటర్ సుజీ బేట్స్ కంటే వెనుక రెండో స్థానంలో ఉంది.
ఈ సెమీఫైనల్‌లో మంధాన ఆ మార్కును అందుకుంటే మహిళల టీ20ల్లో టాప్ స్కోరర్‌గా కొత్త ఘనత సాధించే అవకాశం ఉంది.
తుది జట్లు (అంచనా)...
భారత్: స్మృతి, షెఫాలి, ప్రతీక, హర్మన్‌ప్రీత్ (కెప్టెన్), రిచా, భార్తీ, దీప్తి, ప్రేమ, క్రాంతి, శ్రీచరణి, నందని;
బంగ్లాదేశ్: జువారియా, నిగర్ (కెప్టెన్), శోభన, దిలారా, షోర్నా, రబేయా, షర్మిన్, నహిదా, సుల్తానా, మారుఫా, ఫహిమా.