SL vs IND: ముగ్గురు లెఫ్టార్మ్ స్పిన్నర్లతో బరిలోకి భారత్.. శ్రీలంకకు షాకే!
ఈ వార్తాకథనం ఏంటి
నాలుగో ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ సీజన్‌లో భారత జట్టు మరో కీలక సిరీస్‌కు సిద్ధమైంది. శనివారం నుంచి శ్రీలంకతో టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది. శ్రీలంక పిచ్‌లు స్పిన్‌కు అనుకూలంగా ఉండటంతో తొలి రోజు నుంచే బంతి గింగిరాలు తిరిగే అవకాశముంది. దీంతో తొలి టెస్టులో భారత్ తుది జట్టు ఎలా ఉండబోతుందనే ఆసక్తి నెలకొంది. అయితే టీమ్‌ఇండియా బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ వ్యాఖ్యలను బట్టి చూస్తే.. ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదీ ముగ్గురూ ఎడమచేతి వాటం స్పిన్నర్లు కావడం విశేషం. ''మాకు కుల్‌దీప్ యాదవ్ ఓ అటాకింగ్ బౌలర్. అతడికున్న అనుభవం కచ్చితంగా ఉపయోగపడుతుంది.
వివరాలు
ఆ ముగ్గురు ఉంటే ఇబ్బంది ఉండదు
మిగిలిన ఇద్దరూ కూడా విభిన్నమైన బౌలర్లు. మానవ్ సుతార్ బంతిని కాస్త ఎక్కువగా టర్న్ చేయగలడు.
రవీంద్ర జడేజా మాత్రం నిలకడగా లైన్ అండ్ లెంగ్త్‌లో బౌలింగ్ చేయగలడు. ఈ ముగ్గురూ జట్టులో ఉంటే మాకు ఎలాంటి ఇబ్బంది ఉండదు.
అయితే వారిని కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఎలా ఉపయోగించుకుంటాడనేది చూడాలి.
20వికెట్లు పడగొట్టగల సామర్థ్యం, నైపుణ్యం ఈ ముగ్గురికీ ఉంది. పిచ్ స్వభావాన్ని బట్టే తుది నిర్ణయం తీసుకుంటాం.
ఇక్కడ బ్యాటింగ్ చేయడం సవాలుగా ఉంటుంది. అలాగే ఎవరితో, ఎప్పుడు బౌలింగ్ చేయించాలనే నిర్ణయం కూడా చాలా కీలకం.
అన్ని సవాళ్లను ఎదుర్కొనేందుకు మేం సిద్ధంగా ఉన్నాం.పేసర్ల విషయానికి వస్తే మహ్మద్ సిరాజ్‌కు జోడీగా ఎవరిని ఆడించాలనేది కూడా ఇప్పుడే చెప్పలేం.
వివరాలు
అశ్విన్ అంచనా కూడా అదే..
ప్రసిద్ధ్ కృష్ణ, గుర్నూర్ బ్రార్ గత కొంతకాలంగా నాణ్యమైన క్రికెట్ ఆడుతున్నారు. 25-30 ఓవర్ల తర్వాత
బంతి మృదువుగా మారే అవకాశం ఉంది.ప్రత్యర్థి బ్యాటర్లను ఇబ్బంది పెట్టేందుకు షార్ట్ బాల్స్‌ను కూడా ఉపయోగించడంపై దృష్టి పెడతాం'' అని మోర్కెల్ వెల్లడించాడు.
టీమిండియా తుది జట్టు (అంచనా)
1. యశస్వి జైస్వాల్
2. కేఎల్ రాహుల్
3. దేవదత్ పడిక్కల్
4. శుభ్‌మన్ గిల్ (కెప్టెన్)
5. రిషభ్ పంత్ 6. ధ్రువ్ జురెల్
7. రవీంద్ర జడేజా
8. మానవ్ సుతార్
9. గుర్నూర్ బ్రార్
10. కుల్‌దీప్ యాదవ్
11. మహ్మద్ సిరాజ్